login option
-
గూగుల్ సంచలన నిర్ణయం..!
-
ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం ఎలా?
భద్రతాపరమైన కోణంలో ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం అవసరం. దీని కోసం... ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి బాటమ్ రైట్ కార్నర్లో ప్రొఫైల్‌ను ట్యాప్ చేయాలి. టాప్ రైట్ కార్నర్లో 3–హారిజంటల్ లైన్స్ ట్యాప్ చేయాలి సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి సెక్యూరిటీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి లాగిన్ యాక్టివిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. ఇన్‌స్టాలో లాగిన్ యాక్టివిటీని డిలిట్ చేయడానికి... 1. సెట్టింగ్స్‌లోని ‘లాగిన్ యాక్టివిటీ’ను సెలెక్ట్ చేసుకోవాలి 2. 3–డాట్ బటన్ నొక్కాలి 3. లాగ్ ఔట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి: వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ -
గూగుల్ సంచలన నిర్ణయం
Google Two Step Verification: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్ భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించబోతోంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్ చేయలేరికా!. సాధారణంగా గూగుల్ అకౌంట్‌ను రెగ్యులర్ డివైజ్‌లలో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్‌ను ట్రేస్ చేయడానికి వీల్లేని రేంజ్లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్‌ను లాగిన్ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి. స్వయంగా గూగులే.. Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్. ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ పర్మిషన్ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్‌ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డివైజ్‌లలో లాగిన్ అయ్యేవాళ్లకు 2 సెటప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుంది. రెగ్యులర్ డివైజ్‌లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్ రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది. చదవండి: ఈ యాప్స్‌ను ఫోన్ నుంచి అర్జెంట్‌గా డిలీట్ చేయండి -
PUBG: గేమ్ ఆడాలంటే ఓటీపీ తప్పనిసరి..!
గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్జీ గేమ్ తిరిగి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత క్రాఫ్టన్ సూచనలు పాటిస్తేనే గేమ్ ఆడగాలరని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తాజాగా పబ్జీ గేమ్‌లో లాగిన్‌లో కావాలంటే మొబైల్‌తో ఓటీపీ నిర్ధారణ తప్పనిసరని క్రాఫ్టన్ పేర్కొంది. ఓటీపీ నిర్ధారణ చేయకపోతే గేమ్‌లో లాగిన్ అవ్వలేరని తెలిపింది. ఈ ఓటీపీను కేవలం మూడుసార్లు లాగిన్ కోసం ఎంటర్ చేయవచ్చునని పేర్కొంది. తరువాత ఓటీపీ గడువు ముగుస్తుందని తెలుపగా, ఈ ఓటీపీకి కేవలం ఐదు నిమిషాలపాటు వ్యాలిడిటీ ఉండనుంది. వెరిఫికేషన్ కోడ్ కోసం 24 గంటల్లో పదిసార్లు మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత ఓటిపీ ఫోన్‌కు రాదు. ఒకే ఫోన్ నెంబర్‌ను ఉపయోగించి పది అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చును. క్రాఫ్టన్ ఓటీపీ నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌ను తీసుకొవడంతో డేటా చౌర్యం జరిగే అవకాశం ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు పబ్జీలో ఫేసుబుక్, గూగుల్ అకౌంట్నుపయోగించి యూజర్లు లాగిన్ అయ్యేవారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
బీఆర్ఎస్: లాగిన్ ఐడీ మార్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: భవనాల క్రమబద్దీకరణ కోసం దాదాపు అయిదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది లాగిన్ ఐడీగా తమ ఫోన్ నంబర్ ఇవ్వలేదు. ఆన్లైన్లోనే దరఖాస్తుల్ని సమర్పించాల్సి ఉండటంతో అది తెలియక కొందరు.. ఇతరత్రా పొరపాట్లు దొర్లుతాయేమోనని కొందరు మధ్యవర్తులను ఆశ్రయించారు. వీరిలో ఆర్కిటెక్టులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. చాలామంది మధ్యవర్తులు ప్రజల నుంచి డబ్బు గుంజే ఉద్దేశంతో ఆన్లైన్ దరఖాస్తులో యజమానుల ఫోన్ నంబర్లకు బదులు తమ ఫోన్ నంబర్లనే ఉంచారు. దీంతో జీహెచ్ఎంసీ నుంచి ఏ సమాచారం వెళ్లినా వారికే తెలుస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని, అవసరానికనుగుణంగా ఎక్కువ వసూళ్లు చేయాలనుకున్నవారు వీరిలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఏవైనా షార్ట్‌ఫాల్స్ ఉంటే వాటిని జత చేయాల్సిందిగా యజమానులకు సమాచారం పంపుతున్నారు. వీరిలో చాలామంది ఫోన్‌నంబర్లు యజమానులవి కాకపోవడంతో మధ్యవర్తులు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. యజమానుల ఫోన్‌నంబర్లే ఇచి్చన వారిలోనూ చాలామంది ఫోన్‌నంబర్లు మారాయి. కొందరివి డీయాక్టివేట్ అయ్యాయి. కొందరు యజమానులకు ఫోన్ నంబర్లు ఉంచిన మధ్యవర్తులకు నడుమ కాంటాక్ట్ లేకుండా పోయింది. కొందరు మధ్యవర్తులు నగరంలో లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి దరఖాస్తులోని ఫోన్ నంబర్లకు సమాచారం పంపితే వెళ్లడం లేదు. మధ్యవర్తుల ఫోన్ నంబర్లు ఉంటే వారికే సమాచారం వెళ్తుంది. అది యజమానులకు తెలియడం లేదు. దీంతో సకాలంలో జతచేయాల్సిన షార్ట్‌ఫాల్స్ సంబంధిత డాక్యుమెంట్లు జతచేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో పాటు వారి దరఖాస్తు స్టేటస్‌ను కూడా తెలుసుకోవడం కుదరడం లేదు. పలువురు యజమానులు ఈ పరిస్థితిని వివరిస్తూ తమ అప్లికేషన్లో తమ ఫోన్‌నంబర్‌ను, లేదా మారిన కొత్త నంబర్‌ను ఉంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. పరిస్థితిని గ్రహించిన జీహెచ్ఎంసీ ఇందుకు అవకాశం కలి్పంచింది. ఫోన్ నంబర్ మార్చుకోవాలనుకున్నా, అసలైన యజమానులే తమ ఫోన్ నంబర్‌ను చేర్చాలనుకున్నా, మారిన కొత్త నంబర్‌ను నమోదు చేయాలనుకున్నా ఆన్లైన్ ద్వారా అవకాశం కలి్పంచింది. ఇందుకు తగినవిధంగా సంబంధిత అప్లికేషన్‌ను అప్డేట్ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవడం ద్వారా అడిగిన ప్రాథమిక సమాచారం నమోదు చేసి తమ ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తద్వారా నిజమైన యజమానులు తమ నంబర్‌ను చేర్చుకోవచ్చు. పాత నంబర్ మారితే దాన్ని నమోదు చేయవచ్చు. ఈ సందర్భంగా ఆధార్ నంబర్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. నిజమైన యజమానిగా ధ్రువీకరించుకునేందుకు ఇప్పుడు ఆధార్‌ను కూడా చేర్చారు. సంబంధిత అధికారులు పరిశీలించి, దరఖాస్తు చేసుకున్నది దరఖాస్తుదారే (యజమానే) అని ధ్రువీకరించుకున్నాక ఓకే చేస్తే వారి కొత్త ఫోన్ నంబర్ నమోదవుతుంది. అది లాగిన్ ఐడీగా పనిచేస్తుంది. -
‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని కనిపెట్టిన ఢిల్లీ టెకీకి యాపిల్ సంస్థ సుమారుగా రూ. 75 లక్షల నజరానా ప్రకటించింది. ఐఓస్ 13లో యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే సరైన ఐడీ లేకుండానే యాపిల్ మొబైల్లో వాడే వెసులుబాటు కల్పించే ఓ లోపాన్ని ఢిల్లీకి చెందిన భావుక్ జైన్ కనిపెట్టి యాపిల్ సంస్థకు తెలిపారు. దీంతో వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సంస్థ సరిచేసింది. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తామని యాపిల్ చెప్పినట్లు వెల్లడించారు. భావుక్ జైన్ గతంలో ఫేస్బుక్, యాహూ, గూగుల్, గ్రాబ్ వంటి వాటిల్లో సైతం లోపాలను కనిపెట్టి వారికి తెలియజేశారు. (ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఎంతంటే..?) జూమ్ యాప్‌లో ఎన్క్రిప్షన్ అప్డేట్ న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం జూమ్ తమ యాప్‌నకు తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్లో వినియోగదారులకు మరింత భద్రత, వ్యక్తిగత విషయాల్లో గోప్యతతో పాటు ఏఈఎస్ 256 బిట్ జీసీఎం ఎన్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇతరులకు వినియోగదారుల సమాచారం దక్కదని చెప్పింది. ఈ సదుపాయాలను పొందేందుకు జూమ్ 5.0కు వినియోగదారులు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
తెరుచుకోని ఎంసెట్ లాగిన్ ఆప్షన్
హైదరాబాద్ సీటీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సందర్భంగా సోమవారం వెబ్ ఆప్షన్లకు అవకాశముంటుందని ఎదురుచూసిన అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది. వెబ్ ఆప్షన్లకు సంబంధించి లాగిన్ ఆప్షన్‌ను అధికారులు ఎంసెట్ అధికారిక వెబ్సైట్లో ఓపెన్ చేయకపోవడంతో అభ్యర్ధులు తొలిరోజు ఆప్షన్లు నమోదు చేయలేకపోయారు. సోమవారం రాత్రి లాగిన్‌కు అవకాశమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నా వెబ్సైట్లో అదేమీ కనిపించలేదు. ఇలా ఉండగా ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇటీవలే వెలువడినందున ఆ విద్యార్ధుల ధ్రువపత్రాలను సోమవారం పరిశీలించామని, అందువల్లనే వెబ్‌కౌన్సెలింగ్‌కు తొలిరోజు అవకాశం కల్పించడంలో కొంత ఇబ్బంది అయ్యిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. తొలిరోజు ఇటీవల సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు కౌన్సెలింగ్ అధికారులు వివరించారు. సోమవారం 5వేలమంది ధ్రువపత్రాల పరిశీలన చేపట్టామన్నారు. 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామని, 16వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని కౌన్సెలింగ్ చీఫ్ క్యాంప్ ఆఫసర్ (ఓఎస్డీ) రఘునాథ్ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో పాలిసెట్, ఈసెట్ ైఫైనల్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. పాలిసెట్, ఈసెట్ అభ్యర్ధులు ఈరెండు రోజుల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 18న రంజాన్, 19న ఆదివారం సెలవు రోజులైనందున 20 న పాలిసెట్, 21న ఈసెట్ సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.