breaking news
lobsters
-
అరుదైన ఎండ్రకాయ.. 20 లక్షల్లో ఒకటి ఈ విధంగా..
కార్న్‌వాల్: సాధారణంగా జాలర్లు సముద్రంలో వేటకు వెళ్తుంటారు. ఒక్కోసారి వారి వలకు అరుదైన జీవులు చిక్కుకుంటాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు జాలరులు చాలా అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ అలాంటి జీవులు వారి వలలో చిక్కుకుంటే ఆ వేటగాడి ఆనందానికి అవధులే ఉండవు. అయితే, ఇలాంటి ఘటనే కార్న్‌వాల్ సముద్ర తీరం వెంబడి ఉన్న సముద్రంలో చోటుచేసుకుంది. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం, 25 ఏళ్ల వయసున్న టామ్ ఒక రోజు లాంబోర్న్ తీరం వెంబడి సముద్రంలో వేటకోసం వెళ్లాడు. రోజులాగే ఏదో చేపలో, రోయ్యలో.. ఏవో జీవులు పడతాయనుకున్నాడు టామ్. కానీ, ఆ రోజు టామ్ తనవలలో పడిన జీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జీవిని అంతకు ముందేప్పుడు చూడలేదు. అదోపెద్ద ఎండ్రకాయ. నీలి రంగులో ఉంది. చాలా పెద్దదిగా కూడా ఉంది. కాసేపు దాన్ని పరీక్షగా చూశాడు. అయితే, ఇంటికి తీసుకెళ్లటానికి కుదరక పోవడంతో దాన్ని తిరిగి సముద్రంలో వదిలేయాలని టామ్ అనుకున్నాడు. నీటిలోకి ఎండ్రకాయను వదలే ముందు దాన్ని పట్టుకున్నట్లు గుర్తుగా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టాశాడు. అయితే, కొన్నిరోజులకు టామ్ ఈ ఫోటోలను కార్న్‌వాల్‌లోని నేషనల్ లోబ్ట్సర్ విభాగానికి పంపించాడు. ఈ చిత్రాలను చూసిన వారు ఇది చాలా అరుదైనదని, కొన్నిరకాల జన్యువైవిధ్యాల వలన భిన్న రంగులను కల్గిఉంటుందని తెలిపారు. సాధారణంగా 20 లక్షల జీవుల్లో ఒకటి మాత్రమే ఇలాంటి అరుదైన వైవిధ్యాన్ని కల్గి ఉంటుందని పేర్కొన్నారు. ఇది, దాని జీవితకాలమంతా పెరుగుతునే ఉంటుందని అన్నారు. -
ఎండ్రకాయలతో షాకిచ్చిన క్రికెటర్
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు షాకిచ్చాడు. కరీబియన్ దీవుల్లో దొరికే ఎండ్రకాయలను పట్టుకుని ఫోటోకు ఫోజిచ్చాడు. చూడటానికి భారీ ఆకారంలో ఉన్న ఎండ్రకాయలను చూసిన ఉమేశ్ ఫాలోవర్లలో కొందరు ప్లీజ్ వాటని తినొద్దని అంటే.. మరికొందరు డిన్నర్‌కు మంచి వంటకాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు ఇవేంటో తెలియక తికమక పడి వీటి పేరేంటి అంటూ ఉమేశ్‌ను ప్రశ్నించారు. ఇంకొందరు 'అవి మనుషుల్ని తినేట్టు కనిపిస్తున్నాయి.. వాటిని మీరెలా పట్టుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఐదుమ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతున్న భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. జూలై 6న కింగ్స్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. A post shared by Umesh Yadav (@umeshyaadav) on Jul 3, 2017 at 4:53pm PDT