breaking news
List of cities
-
ఎక్కడ... ఎంత సురక్షితం?
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో, మహిళల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ప్రతిస్పందనను అలాగే వారి జీవిత అనుభవాల ఆధారంగా 31 నగరాల్లో 12,000 కంటే ఎక్కువమంది మహిళలను సర్వే చేసిన నారీ నేషనల్ యాన్యువల్ రి పోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం 2025లో మహిళలకు అత్యంత సురక్షితమైన భారతీయ నగరాల జాబితా...1. కోహిమా (నాగాలాండ్): లింగ లింగ సమానత్వ భావనను సమర్థంగా అమలు చేయడం, చురుకైన కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రసిద్ధి చెందిన నాగాలాండ్ రాజధాని కోహిమా, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. వ్యక్తిసంబంధాలు, మంచి ఇరుగు పొరుగు, పౌర కార్యక్రమాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం వల్ల భద్రతపై అధిక అవగాహన సాధ్యమైంది.2.విశాఖపట్నం: మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజారవాణా పోలీసులు, స్థానిక అధికారులు, ప్రజల మధ్యఅవగాహన సమన్వయం కారణంగా ఈ నగరం మహిళల భద్రతకు రెండో సేఫెస్ట్ ప్లేస్ అయింది.3. భువనేశ్వర్: సమర్థవంతమైన పనితీరు, నేరాల విçషయమై తక్షణమే ప్రతిస్పందించే వ్యవస్థ, ఉమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, వారి హక్కుల పట్ల సునిశిత, సున్నిత అవగాహన, సమగ్ర పట్టణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ కారణంగా భువనేశ్వర్ నారీ నివేదికలో మూడో స్థానం సంపాదించింది. ఇక ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్, ముంబైలు వరుసగా ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. -
మహిళలకు ‘ప్రమాదకర’ నగరాలివే!
న్యూయార్క్: ప్రపంచం చర్చించుకుంటున్న తాజా అంశాల్లో ‘మహిళల భద్రత’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని మహిళా సంఘాలు గొంతుచించుకుంటున్నా.. లైంగిక వేధింపులు, మాటలు, చేతలతో చిత్రహింసలు, ఇతర సమస్యలు ఏమాత్రం తగ్గటం లేదు. మరీ ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివని.. థాంప్సన్ రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల రాజధానులతోపాటు ఇతర 16 ముఖ్య నగరాల్లో సర్వే నిర్వహించి.. మహిళలపాలిట అపాయకరంగా మారిన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. లండన్‌లో 18-34 ఏళ్ల మధ్య వయసున్న మహిళ్లలో 41 శాతం మంది భయంకరమైన లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడైంది. తొలి 16 నగరాల జాబితా బొగోటో (కొలంబియా), మెక్సికో సిటీ, లిమా (పెరూ), న్యూఢిల్లీ, జకార్తా, బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా), కౌలాలంపూర్, బ్యాంకాక్, మాస్కో, మనీలా, పారిస్, సియోల్, లండన్, బీజింగ్, టోక్యో, న్యూయార్క్. -
టాప్ టెక్నాలజీ నగరాల్లో బెంగళూరు
20 నగరాల జాబితాలో 12వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీకి కేంద్రాలుగా నిలుస్తున్న నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. 20 నగరాల జాబితాలో 12వ స్థానంలో నిల్చింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్ఎల్) నిర్వహించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ వార్షిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లండన్, శాన్ జోసె, బీజింగ్ నగరాలు ఈ లిస్టులో తొలి మూడు స్థానాల్లోను ఉన్నాయి. టాప్ 20లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ ఢిల్లీ, ముంబై క్రమంగా మెరుగుపడుతున్నాయి. మెరుగైన ఆర్థిక వృద్ధి, ఇన్ఫ్రాలో పెట్టుబడులు, స్టార్టప్‌ల ఏర్పాటు, ఆఫీసులకు సంబంధించి రియల్ ఎస్టేట్ వినియోగం గణనీయంగా ఉండటం తదితర అంశాలు బెంగళూరుకు సానుకూలంగా నిల్చాయని జేఎల్ఎల్ ఇండియా చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.