
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో, మహిళల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ప్రతిస్పందనను అలాగే వారి జీవిత అనుభవాల ఆధారంగా 31 నగరాల్లో 12,000 కంటే ఎక్కువమంది మహిళలను సర్వే చేసిన నారీ నేషనల్ యాన్యువల్ రి పోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం 2025లో మహిళలకు అత్యంత సురక్షితమైన భారతీయ నగరాల జాబితా...
1. కోహిమా (నాగాలాండ్): లింగ లింగ సమానత్వ భావనను సమర్థంగా అమలు చేయడం, చురుకైన కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రసిద్ధి చెందిన నాగాలాండ్ రాజధాని కోహిమా, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. వ్యక్తిసంబంధాలు, మంచి ఇరుగు పొరుగు, పౌర కార్యక్రమాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం వల్ల భద్రతపై అధిక అవగాహన సాధ్యమైంది.
2.విశాఖపట్నం: మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజారవాణా పోలీసులు, స్థానిక అధికారులు, ప్రజల మధ్యఅవగాహన సమన్వయం కారణంగా ఈ నగరం మహిళల భద్రతకు రెండో సేఫెస్ట్ ప్లేస్ అయింది.
3. భువనేశ్వర్: సమర్థవంతమైన పనితీరు, నేరాల విçషయమై తక్షణమే ప్రతిస్పందించే వ్యవస్థ, ఉమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, వారి హక్కుల పట్ల సునిశిత, సున్నిత అవగాహన, సమగ్ర పట్టణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ కారణంగా భువనేశ్వర్ నారీ నివేదికలో మూడో స్థానం సంపాదించింది. ఇక ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్, ముంబైలు వరుసగా ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి.