breaking news
lift services
-
మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్.. 2 గంటలు నరకయాతన!
ఉప్పల్: స్కైవాక్ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువకుడు దాదాపు బతుకుజీవుడా సుమారు 2 గంటల పాటు అందులో చిక్కుకుని విలవిలలాడాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకుంటాయా.. లేదా? అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు టెక్నీషియన్ వచ్చి చర్యలు చేపట్టడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్ స్కైవాక్పై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్ (22) అనే యువకుడు ఉప్పల్‌లో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్‌కు బయలుదేరాడు. ఉప్పల్ రోడ్డు దాటడానికి ౖస్కైవాక్ వంతెన ఎక్కి కిందకు దిగడానికి లిఫ్ట్–6లో వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్ 100, 108 అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.లిఫ్ట్‌ల మె యింటెనెన్స్ చూస్తున్న హెచ్ఎండీఏ సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. లిఫ్ట్‌లోని రాహుల్ అరుపులు, కేకలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు 2 గంటల తర్వాత ఎట్టకేలకు టెక్నీíÙయన్ రావడంతో కథ సుఖాంతం అయ్యింది. రాత్రి 11.30 నుంచి 1.15 నిమిషాల వరకు రాహుల్ యువకుడు బిక్కుబిక్కుమంటూ లిఫ్ట్‌లోనే గడపాల్సి వచ్చింది. తాను హార్ట్ పేషెంట్‌నని, లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో భయాందోళన చెందినట్లు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.జడుసుకుంటున్న జనం ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ఎక్కడానికి ప్రయాణికులు జంకుతున్నారు. అందులోనూ లిఫ్ట్‌లు ప్రమాదకరంగా మారాయంటున్నారు. మొదట్నుంచీ లిఫ్ట్‌లు మొరాయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ వంతెనకు ఎనిమిది లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్లు 24 గంటల పాటు పని చేస్తుంటాయి. రోజూ వేలాది మంది స్కైవాక్ ఎక్కి దిగుతుంటారు.లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. లిఫ్ట్లోఉన్న వారు తలుపులను బలవంతంగా తెరవడం, అటూ ఇటూ లాగడం వల్ల సెన్సా ర్లు పని చేయవని, గురువారం రాత్రి అదే జరిగిందని హెచ్ఎండీఏ అధికారులు వివరణ ఇచ్చారు. టెక్నీíÙయన్ వచి్చన తర్వాతే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయని స్పష్టం చేశారు. -
గంటపాటు లిఫ్టులో నరకం
సాక్షి, ఆరిలోవ(విశాఖపట్నం) : హెల్త్‌సిటీ ఈఎస్ఐ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. కింద నుంచి పైఅంతస్తుకు రోగులు, వారి బంధువులు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్నవారు హాహాకారులు చేశారు. సుమారు గంటపాటు నరకం చూశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో రెండు లిఫ్ట్‌లున్నాయి. వాటిలో ఇప్పటికే ఒకటి మొరాయించి మూలకు చేరింది. ఉన్నది కూడా ఇప్పుడు మొరాయించింది. ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నమోదు చేసుకొని మూడో ఫ్లోర్లో ఉన్న వైద్యులను కలవడానికి కొందరు రోగులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు లిఫ్ట్‌లో వెళ్లదలచారు. చిన్న లిఫ్ట్ కావడంతో దానిలో నలుగురు మాత్రమే పట్టే సామర్థ్యం ఉంది. కానీ ముగ్గురు రోగులతో పాటు మరో నలుగురు వారి సహాయకులు (మొత్తం ఏడుగురు) లిఫ్ట్‌లో ఎక్కేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఎక్కిని వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకొన్నాయి. ఒక్క అడుగు పైకి లేచి లిఫ్టు అక్కడే నిలిచిపోయింది. ఆ తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారంతా పెద్ద కేకలు పెడుతూ రక్షించడంటూ బయట ఉన్నవారిని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువలు లిఫ్ట్ వద్దకు పారొచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి నానా హైరాన పడ్డారు. బోల్టులు విప్పినా తలుపులు తెరుచుకోలేదు. ఇనుప రాడ్లు తీసుకొచ్చి సిబ్బంది తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. లిఫ్ట్ లోపలకు ఆక్సిజన్ మరో పక్క లోపల ఉన్నవారికి గాలి ఆడక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలే చిన్న లిఫ్ట్‌లో ఏడుగురు ఉన్నారు. అప్పటికే సుమారు గంట నుంచి లోపల ఉండిపోయారు. లోపల ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైద్యుల సలహాతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండరు తీసుకొచ్చి లిఫ్ట్ లోపలకు పైపు ద్వారా పంపించారు. దీంతో లోపల ఉన్నవారికి ఊరట కలిగింది. అయినా బయటపడతామోలేదోనని కేకలు వేస్తున్నారు. కొంతసేపటికి మొదటి ఫ్లోర్‌లోకి కొందరు వెళ్లిరాడ్లు, రెంచీలు సహాయంతో పైనుంచి లిఫ్ట్ బోల్టులు విప్పి తలుపులు పక్కకు నెట్టారు. అప్పుడు గాని లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలుపడలేదు. ఈతతంగమంతా సుమారు గంటకు పైగా పట్టింది. లిఫ్ట్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు రాగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నానా హైరానాతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా అభినందించారు. అనంతరం పాడయిన ఆ లిఫ్ట్ ఎవరూ ఎక్కకుండా మూసేశారు. -
'గాంధీ’లో నిలిచిపోయిన లిఫ్ట్ సేవలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగుల బంధువులు లిఫ్ట్ బాయ్స్‌పై దాడి చేయడంతో.. దానికి నిరసనగా వారు లిఫ్ట్‌లు సేవలను ఆపేశారు. దీంతో పేషెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు. లిఫ్ట్‌లు నిలిచిపోవడంతో సమయానికి క్యాంటీన్ నుంచి భోజనాలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు.


