గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగుల బంధువులు లిఫ్ట్ బాయ్స్‌పై దాడి చేయడంతో.. దానికి నిరసనగా వారు లిఫ్ట్‌లు సేవలను ఆపేశారు. దీంతో పేషెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు. లిఫ్ట్‌లు నిలిచిపోవడంతో సమయానికి క్యాంటీన్ నుంచి భోజనాలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు.