breaking news
Lifestyle Building
-
ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!
బరువు తగ్గాలంటే తిండిమానేస్తే సరిపోదు? ఫ్యాడ్ డైట్,ఉపవాసం అంటూ కడుపుమాడ్చుకుంటే సరిపోదు. ఇంట్లో పని అంతా చేస్తున్నాంగా.. ఏదో కొద్దిగా వాకింగ్ చేస్తున్నాంగా అంటే సరిపోదు. ఊపికి సలపని పనులు అసలు టైమే దొరకడం లేదు.. ఇంకెక్కడి ఎక్స్ర్సైజులు అంటూ నిట్టూరిస్తూ సరిపోదు.. మరి అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. పదండి..కొన్ని ముఖ్యమైన చిట్కాలతో సహా, ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.ముందు అసలు బరువు ఎందుకు తగ్గాలి దీనిపై అవగాహన ఉంది. మనశరీరం, మన ఆరోగ్యం, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి? ఫిట్‌గా ఉండాలనే సంకల్పం ఉండాలి. ఎంత బరువు అధికంగా ఉన్నాం, ఎంత తగ్గాలి మన బీఎంస్మాస్ ఇండెక్స్ ఎంత అనే లెక్కలు గమనించుకోవాలి. చివరిగా తగ్గాల్సిన బరువు, సమయం దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్లాన్ చేసుకోవాలి. ఇది నిపుణుల ద్వారాగానీ, వ్యక్తిగత అవగాహన ద్వారా గానీ చేసుకోవచ్చు.బరువు తగ్గడానికి కారణమైన అలవాట్లను మార్చుకోవాలనే బలమైన కోరిక ఉందాలేదా అనేది నిర్ధారించు కోవాలి. నా శారీరక శ్రమ ,వ్యాయామ అలవాట్లను మార్చడానికి సిద్ధంగా ఉన్నానా? అనేది ప్రశ్నించుకుని, నిర్ణయించుకుని ముందుకు సాగాలి.ఇదీ చదవండి: ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!అలాగే ఏదో మంత్రం వేసినట్టు బరువు తగ్గడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. మన బరువును బట్టి ఎంత సమయంలో ఎంత బరువు తగ్గవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓపిగ్గా దీర్ఘకాలం పాటు బరువు తగ్గాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీన్ని యాక్షన్ గోల్, రిజల్ట్ గోల్ అనే రెండు రకాలు డివైడ్ చేసుకోవాలి.ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి ఇది యాక్షన్ గోల్. 4.5 కిలోగ్రాముల తగ్గాలి అనేది రిజల్ట్ గోల్.టాప్ టిప్స్జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతీ రోజూ నడకతోపాటు, యోగా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. అవసరమైతే జిమ్ ట్రైనర్ శిక్షణలో కొన్ని కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలి.లోకాలరీ ఫుడ్, హై ప్రొటీన్డ్, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడిని నియంత్రించుకోవడానికి అవసరమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు. చక్కని నిద్ర చాలా అవసరం.దీర్ఘకాలంలో వారానికి 0.5 -1 కిలోగ్రాము) తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ప్రకారం ప్రతి రోజు తీసుకునే కేలరీలతో పోలిస్తే 500 - 750 కేలరీలు ఎక్కువగా బర్న్ చేయాలి.ఎక్కువగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు తినాలి. కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండేలా కడుపు నిండా తినవచ్చు. ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు.రోజుకు కనీసం నాలుగు సార్లు కూరగాయలు,మూడు సార్లు పండ్లు తినండి. భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే పండ్లు ,కూరగాయల సలాడ్ తినవచ్చు. (ట్రంప్ పెర్ఫ్యూమ్స్ : ‘విక్టరీ 45-47’ లాంచ్.. సీక్రెట్ ఏంటంటే..!)బ్రౌన్ రైస్, బార్లీ , హోల్-వీట్ బ్రెడ్ , మిల్లెట్స్‌తో చేసిన ఆహారం, ఇంకా ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడో, నట్స్, నట్స్ బటర్స్ , నట్స్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి.చక్కెర పదార్థాలకు పూర్తిగా నో చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అసలే ముట్టు కోవద్దు. ప్రతి ఆహారం ముద్దను ఆస్వాదిస్తూ, రుచిని ఎంజాయ్ చేస్తూ చక్కగా నమిలి మింగండి. అంతే తప్ప హడావిడిగా అస్సలు ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు టీవీని ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నోట్ : నాలుగు రోజులు చేసి ఫలితం రాలేదని నిరాశ పడకూడదు. పట్టుదలగా బరువు తగ్గిన వారిని చూసి ఇన్ స్పైర్ అవ్వాలి. బరువు తగ్గడం వలన అందం మాత్రమే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. అనేక రకాల, ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్స్ నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు,గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించే ముందు, వైద్యుడిని సంప్రదించి అంతర్లీనంగా ఏవైనా సమస్యలున్నాయా? అనేది తనిఖీ చేసుకొని తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. -
ఇలా చేస్తే ఎక్కువకాలం బతికేయొచ్చు.. రీసెర్చ్‌లో వెల్లడైంది కూడా
మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, మీరు మీ జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు ఆరోగ్యకరమైన తిండి, నిద్రవేళలను కచ్చితంగా కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర ప్రణాళిక అవసరం. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం వంటి స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను పాటించడం మీకు ఎక్కువ కాలం జీవించడంలో ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవద్దు. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని అదే సమయంలో కచ్చితంగా నిద్రించాలి. అంతేకాదు, రోజూ ఒకే సమయంలో నిద్ర నుంచి మేలుకోవాలి. ► కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలం జీవించాలనుకుంటే, మీ మెదడు, శరీరాన్ని పునరుద్ధరించడానికి ప్రతి రాత్రి 8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర మీ మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి, శక్తి స్థాయులను మెరుగుపరుస్తుంది. చెదిరిన లేదా కలత నిద్ర మీ మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ► విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. దీనివల్ల మీ మనస్సుకే కాదు, శరీరానికి కూడా రోజంతా హాయిగా ఉండేందుకు అవసరమైన విరామం లభిస్తుంది. మీరు దీన్ని ఎలా చేస్తారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ► ప్రపంచంలోని చాలా మంది ప్రజలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. వారు క్రమం తప్పకుండా నడవడం, పుస్తకం చదవడం, వెచ్చని చామంతి టీ తాగడం వంటివి చేస్తారు. ఆనందంగా ఉండటమే.. ఎక్కువ కాలం జీవించేందుకు కారణం. ► సుదీర్ఘ జీవితాన్ని గడపడంలో మీ ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా తినొద్దు. సరైన సమయంలో తగినంత తినడం శరీర బరువును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు అల్పాహారం, మధ్యాహ్న భోజనం మీకు నచ్చినట్లుగా తినవచ్చు. రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవచ్చు. ►కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. -
సెల్ఫీ టేస్ట్
సెల్ఫీ ట్రెండ్ విజృంభణతో సిటీలో ప్రమోషన్ యాక్టివిటీస్‌కు అది ఊతమిస్తోంది. బేగంపేటలోని లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌లో ఉన్న ఓరిస్ డే థాలి రెస్టారెంట్ అందిస్తున్న ఆఫర్ అందుకో లే‘టేస్ట్’ ఎగ్జాంపుల్. ఈ రెస్టారెంట్లో సరికొత్త మెనూ అందించే రుచులను టేస్ట్ చేస్తూ... తమతో పాటు డిషెస్‌ను కూడా కలిపి చక్కగా బంధించిన సెల్ఫీలకు ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు అందిస్తున్నారు. దాంతో వచ్చిన అతిథులంతా నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదిస్తూనే మెచ్చే విధంగా సెల్ఫీలు క్లిక్ మనిపిస్తున్నారు. ‘‘గెస్ట్స్ తీసిన సెల్ఫీలను వాట్సప్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేస్తే వాటిలో ఎంపిక చేసి గిఫ్ట్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నాం. మరోవైపు మా బఫే మెనూలో ఐటమ్స్‌ను బాగా పెంచాం. మంగళవారం స్పెషల్‌గా రూ.199కే బఫేని అందిస్తున్నాం’’ అని రెస్టారెంట్ మేనేజర్ బసంత్ చెప్పారు.