breaking news
Lenovo Z5
-
4 టీబీ స్టోరేజ్‌తో ఆ ఫోన్ వచ్చేస్తోంది..
10 లక్షల ఫోటోలు, 2000 హెచ్డీ మూవీలు స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ చేసుకునేలా.. అత్యధిక మొత్తంలో స్టోరేజ్ ఆప్షన్‌తో లెనోవో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జూన్ 5న చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని తెలిసింది. లెనోవో మొబైల్స్ అధికారిక వైబో అకౌంట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. లాంచ్ డేట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం షేర్ చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో బీజింగ్‌లో లాంచ్ చేయనుంది. అయితే భారత్ లాంటి ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. వైబోలో లెనోవో షేర్ చేసిన పోస్టులో ‘కేవలం ఈ క్షణం, జూన్ 5, బీజింగ్‌లో కొత్త నేషనల్ ఫ్లాగ్షిప్ వచ్చేస్తోంది’ అని ఉంది. చైనాలో స్టాండర్డ్ టైమ్ మధ్యాహ్నం రెండు గంటలకు(భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం 11.30కు) లాంచ్ ఈవెంట్ జరుగనుంది. లెనోవో లాంచ్ చేయబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ పేరు జెడ్5గా తెలిసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్లను సైతం లెనోవో విడుదల చేసింది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా, బెజెల్-లెస్ డిజైన్ ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అంతకముందు లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ విడుదల చేసిన కెమెరా శాంపుల్స్‌లో కూడా ‘ఏఐ డ్యూయల్ కెమెరా’ ఉన్నట్టే ఆ ఫోటోల కింద భాగంలో ఆయన రాశారు. కాగ, ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌లో 2000 హెచ్డీ మూవీలు, 1,50,000 మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ అంతకముందే తెలిపారు. తక్కువ వెలుతురులో కూడా క్లారిటీ ఫోటో తీసుకునేలా, ఫోటోగ్రఫీ అనుభవాన్ని పెంచేలా ఏఐ ఫీచర్‌ను కంపెనీ కల్పిస్తోంది. 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్ రూపొందుతుంది. అంటే ఈ ఫోన్లో అత్యంత ఎక్కువ స్టోరేజ్ మాత్రమే కాక, అతిపెద్ద బ్యాటరీ కూడా ఉండబోతుందన్నమాట. జెడ్5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్కెచ్లను సైతం లెనోవో షేర్ చేసింది. ఈ పిక్చర్స్‌లో ముందు భాగమంతా బెజెల్-లెస్ డిస్ప్లేతోనే రూపొందిందని తెలిసింది. -
4 టీబీ స్టోరేజ్‌తో లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్
10 లక్షల ఫోటోలను, 2000 హెచ్డీ మూవీలను ఒక స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చా అంటే, నిజంగా అసాధ్యం అనేస్తారు. ఇప్పుడున్న ఫోన్లలో అంత స్టోరేజ్ ఎక్కడుందని ఠక్కున ప్రశ్నిస్తారు. కానీ త్వరలోనే అంత ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యంతో కూడా ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలోకి వచ్చేస్తోందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో నుంచి ఓ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతుందని తెలిసింది. మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ చైనీస్ సోషల్ నెటివర్కింగ్ వెబ్సైట్ వైబో ద్వారా తెలియజేశారు. లెనోవో నుంచి తర్వాత రాబోతున్న ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అత్యధిక మొత్తంలో 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని టీజ్ చేశారు. ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌లో 2000 హెచ్డీ మూవీలు, 1,50,000 లూస్లెస్ మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ తెలిపారు. ఇప్పటికే ఈ డివైజ్ లెనోవో జెడ్ 5గా ధృవీకరణ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కాబోతుంది. త్వరలోనే భారత్‌కు కూడా రానున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టికల్ టెక్నాలజీతో ఇది రూపొందుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు ఎలక్ట్రిక్ బ్లూ బాడీ ఉండనుంది. ఛెంగ్ రివీల్చేసిన ఇమేజ్‌లో ఇది పూర్తిగా బెజెల్-లెస్ స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది.