లెనొవొ ఎస్ సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: లెనొవొ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఎస్660ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యుయల్ 3జీ సిమ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999 అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తేనున్నామని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఫిబ్రవరిలోనే లెనొవొ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను తొలిసారిగా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నామని లెనెవొ పేర్కొంది.
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, లెనొవొ డుఇట్ యాప్స్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని లెనొవొ వివరించింది.