లెనొవొ ఎస్ సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ | Lenovo’s quad-core S660 launched for Rs 13,999 | Sakshi
Sakshi News home page

లెనొవొ ఎస్ సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్

Apr 15 2014 1:53 AM | Updated on Sep 2 2017 6:02 AM

లెనొవొ ఎస్ సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్

లెనొవొ ఎస్ సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్

లెనొవొ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఎస్660ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యుయల్ 3జీ సిమ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999 అని కంపెనీ పేర్కొంది.

 న్యూఢిల్లీ: లెనొవొ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఎస్660ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యుయల్ 3జీ సిమ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999 అని  కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తేనున్నామని బార్సిలోనాలో జరిగిన మొబైల్  వరల్డ్ కాంగ్రెస్‌లో  ఫిబ్రవరిలోనే లెనొవొ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను తొలిసారిగా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నామని లెనెవొ పేర్కొంది.

  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,  1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, లెనొవొ డుఇట్ యాప్స్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని లెనొవొ వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement