Legal advice centers
-
ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..
నేను పోలాండ్ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు. తనకోసం ఇక్కడ వీసా దరఖాస్తు చేస్తుండగా ఇటలీలో పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్ భారతదేశంలో కూడా చెల్లుతుంది అని భారతదేశ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా కోర్టు ఆర్డరు ఏవైనా ఉంటే తేవాలి అని సూచించారు. మేము ఇంకా భారతదేశ పౌరులమే కాబట్టి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అని చె΄్పారు. మా పెళ్లి భారత దేశంలో చెల్లుతుందా? లేక అక్కడికి వచ్చి ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలా? సరైన సలహా ఇవ్వగలరు.– భరద్వాజ్, పోలాండ్ విదేశాలలో ఉంటున్న భారతీయులు పెళ్లి చేసుకుంటే (లేదా పెళ్లి చేసుకోబోతున్న వారిలో కనీసం ఒకరు భారతీయులు అయి ఉంటే) ఆ వివాహం భారతదేశంలో కూడా ‘ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం చట్టబద్ధమే. అయితే మీరు అదే విధమైన పెళ్లి భారతదేశంలో చేసుకుని ఉంటే ఆ పెళ్లికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకు (1) మీకు ఇదివరకే పెళ్లి అయ్యి మీ భార్య/భర్త జీవిస్తూ (విడాకులు లేకుండా) ఉండకూడదు.(2) మీరు ఉంటున్న దేశంలో కూడా మీ పెళ్లి చట్టబద్ధమైనది అయి ఉండాలి (3) మీరు పెళ్లి చేసుకున్న దేశంలోని అధికారులు మీ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అపాస్టిల్ చేయాలి. ఇటలీ దేశం కూడా భారతదేశంతోపాటు హేగ్ కన్వెన్షన్ ఒప్పందం లో సంతకం చేసింది కాబట్టి, మీ వీసా దరఖాస్తుకు – భారత దేశంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా అపాస్టిల్ చేసిన ఆ దేశ వివాహ ధ్రువీకరణ పత్రం చట్టబద్ధమైనదే!అలాంటి వివాహాలను రిజిస్టర్ చేయడానికి మీరు పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి ఇండియన్ ఎంబసీ లో కూడా వివాహాలను రిజిస్టర్ చేయడానికి ఒక ఆఫీసర్ ఉంటారు. ఇటలీలో మీరు పొందిన సర్టిఫికెట్ తీసుకొని ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అవసరమైన అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోండి. మీ దంపతులు – సాక్షులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం మీకు సరిపోతుంది. (శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయండి) (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
న్యాయ సలహా కేంద్రాలకు కొత్త హంగులు
నిజామాబాద్ లీగల్, న్యూస్లైన్: గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో న్యాయ సలహాలు అందించడానికి ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. న్యాయ సలహాల కోసం కోర్టుల వద్దకు వెళ్లనవసరం లేకుండా ప్రజల వద్దకు న్యాయ సలహాలు అందించడం ఈ కేంద్రాల లక్ష్యం. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండి ప్రజలకు చట్టపరమైన విషయాలలో ఉచితంగా సలహాలను అందిస్తారు. న్యాయ సలహాల కేంద్రాల పేర్లను న్యాయ పరిరక్షణ, అభివృద్ధి కేంద్రాలుగా వ్యవహరిస్తూ ప్రతి కేంద్రం వద్ద నూతనంగా బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కాకుండా ఇతర రోజులలో సలహాలు కోరే ప్రజల సౌకర్యార్థం అన్ని కేంద్రాల వద్ద ఆయా పంచాయతీల సహకారంతో ఒక ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చే స్తున్నారు. సలహాలను కోరేవారు దాఖలు చేసే పత్రాలను ఈ పెటె ్టలో వేస్తే న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి పరిశీలించి తగు న్యాయ సహాయం అందిస్తారు. అలాగే న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తదితర ఫోన్ నెంబర్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.