breaking news
laxminaryana
-
బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు
l ఆదివాసీల అభివృద్ధిని విస్మరించిన పాలకులు l పోరాటాలే మన హక్కుల సాధనకు ఊపిరి l తుడుందెబ్బSరాష్ట్ర పొలిట్‌బ్యూరో కోచైర్మన్ లక్ష్మీనారాయణ l మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏటూరునాగారం : బహుళజాతి కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరుస్తూ ఆదివాసీల ఖనిజ వనరులు, సంపదను ప్రభుత్వాలు దోచిపెడుతు న్నాయని తుడుం దెబ్బSరాష్ట్ర పొలిట్ బ్యూరో కోచైర్మన్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు పొడెం బాబు ఆరోపించారు. మంగళవారం కొమురం భీం మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. 70 ఏళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీలు బతుకుతున్నారని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ఐటీడీఏలు ఏర్పా టు చేసినా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. కోట్లాది రూపాయలు తమ కోసం ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల చూపించి మైదాన ప్రాంతాల ప్రజ లకు ఖర్చు చేస్తుందన్నారు. బుధవారం వరంగల్‌లో జరిగే సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఐ రఘుచందర్ మాట్లాడుతూ ప్రకృతితో పెనువేస్తుకున్న జీవనం ఆదివాసీల మ న్యంలోనే ఉంటుందన్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సభలో తుడుం దెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు ఇర్ప విజయ, ఏటీడబ్ల్యూఓ దబ్బగట్ల జనార్దన్, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, పొడెం శోభన్, అర్రెం లచ్చుపటేల్, చంద రఘుపతి, సపక నాగరాజు, బంగారు సాంబయ్య, దబ్బ సుధాకర్, చాప బాబుదొర, కోరం సంతోష్, బోదెబోయిన జయందర్, పొడెం నాగేశ్వర్రావు, సోలం పుల్లరావు, జానికిరామ్ పాల్గొన్నారు. కాగా, సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. తీర్మానాలు l ఎస్టీలలో వర్గీకరణ కోసం కమిషన్‌ను నియమించాలి l ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఆదివాసీలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి l 1/70 చట్టం అమలు కోసం ఐటీడీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి l పీసా, అటవీహక్కుల చట్టాలను అమలు చేయాలి, సాదాబైనామాలను ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయరాదు l జీఓ నంబర్ 3 ప్రకారం ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి l ఏజెన్సీ ప్రాంతాలకున్న జీఓల ప్రకారం వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు l ఏజెన్సీ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్టేన్సి ప్రకటించాలి l ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు, సాగు నీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
మరికల్, న్యూస్‌లైన్ : ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ధన్వాడ మండలం తీలేర్ కు చెందిన మెహన్‌రాజు (38) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నాడు. మంగళవారం ఉదయం తన కారులో మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి అందులో తీసుకుని రాత్రి సుమారు 7.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలోని లాల్కోటచౌరస్తా సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 27న శబరి యాత్రకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న క్రమంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కుంటుంబ సభ్యులు బోరున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొన్న సంఘటనలో.. పోలేపల్లి (బొంరాస్‌పేట) : అప్పుడే భోజనం చేసి కాసేపు ఇంటిముందున్న కట్టపై కూర్చున్న వృద్ధురాలిపైకి కారు దూసుకొచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం బొంరాస్‌పేట మండలం పోలేపల్లికి చెందిన కటకం పార్వతమ్మ (80) భోజనం చేసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చుంది. అంతలోనే దామరగిద్ద మండలం అన్నాసాగర్‌కు చెందిన అంతారం హన్మంతు మద్యం మత్తులో కారు నడ పడంతో ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి కుమారుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనర్సిములు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోగా వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు.