breaking news
last signatures
-
బ్రిటన్ రాణి చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది. సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్‌కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యారు. 80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
కిరణ్‌కు చివరి సంతకాల ఉచ్చు?
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన పదవీకాలం చివరలో చేసిన సంతకాలు ఉచ్చులా బిగుసుకోనున్నాయా? అధికార ప్రతిపక్ష నేతలు అందరూ ఆ సంతకాలపైనే ఆరోపణలు, పిర్యాదులు చేస్తున్నారు. చివరి సంతకాలకు సంబంధించి గతంలో ఏ ముఖ్యమంత్రిపై రానన్ని ఆరోపణలు కిరణ్‌పై వచ్చాయి. కిరణ్ 3 సంవత్సరాల 2 నెలల 19 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందిన తరువాత 2014 ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కిరణ్ తనకు, తనకు సంబంధించినవారికి లబ్ది చేకూరే విధంగా చివరలో సంతకాలు పెట్టినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆ సంతకాలపై విచారణ చేపడితే ఆయన చిక్కుల్లోపడే ప్రమాదం ఉంది. ఆయన రాజీనామా చేస్తున్నారన్న వార్తలు రాగానే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు. తమ నియోజకవర్గ పనులతో పాటూ సొంత పనులకు కూడా చక్కదిద్దుకున్నారు. చివరి రోజుల్లో సిఎం వెంటబడిమరీ తమ ఫైళ్ల పై సంతకాలు పెట్టించుకున్నారు. ఒక్క కాంగ్రెస్ వారే కాకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా సీఎం చాంబర్లో క్యూకట్టి తమ పనులు చేయించుకున్నారు. కిరణ్ కూడా ఏమనుకున్నారో ఏమో ఫైలు తెచ్చిన వారందరికి సంతకాలు చేసేశారు. ఈ క్రమంలో తమకు కావలసినవారికి పోస్టింగులు - ప్రత్యేక అనుమతులు ... ఇలా అనేక పనులు జరిగిపోయాయి. కిరణ్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో ఏ రోజూ చేయనన్ని సంతకాలు చివరి రోజున చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చివరి రోజులలో రాత్రి పగలు సంతకాలు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ చివరి రోజులలో ఏఏ ఫైళ్లపై సంతకాలు చేశారో వాటిపై విచారణ జరిపించాలని వైఎస్ఆర్ సిసి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌లు గవర్నర్ నరసింహన్‌ను కలిసి కిరణ్ చివరగా చేసిన సంతకాలను సమీక్షించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా చేసిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి అవినీతి చిట్టాను గవర్నర్ ముందు ప్రవేశపెడతామని కూడా ఆయన చెప్పారు. ఈ విధంగా సీఎంగా కిరణ్ చివరి సంతకాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతే విచారణకు ఆదేశించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విచారణ ఎక్కడకు దారి తీస్తుందో వేచిచూడాల్సిదే!