breaking news
lanco hills
-
లిఫ్ట్‌లో తండ్రీకూతుళ్ల నరకయాతన
సాక్షి, హైదరాబాద్ : తండ్రి కూతురు లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకయాతన పడిన సంఘటన హైదరాబాద్‌లోని మణికొండలో చోటు చేసుకుంది. ల్యాంకో హిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆదివారం తన కూతురుతో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం 40 నిమిషాల పాటు అతడు ఆర్తనాదాలు చేశాడు. అయినా ఎవరూ రాకపోవడంతో స్వయంగా లిప్ట్ తలుపులు తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. చివరకి తన ప్రయత్నం ఫలించి తలుపులు తెరచుకోవడంతో లిఫ్ట్ నుంచి కూతురితో క్షేమంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలు ఆక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
పేకాడుతూ దొరికిన మౌంట్ ఒపెరా ఎండీ
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో పేకాటస్థావరంపై సైబరాబాద్ ఎన్వోటీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ముగ్గురు మహిళల సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మౌంట్ ఒపెరా ఎండీ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారని అని పోలీసులు తెలిపారు.