breaking news
Lakshmi Kalyanam
-
నీ చేపకళ్లు... చేపకళ్లు గిచ్చుతున్నవే!
‘కాజల్ కళ్లు... బ్యూటీ కావ్యాలు’ అంటారు అభిమానులు. అలా అన్నారు కదా అని అందమైన పాత్రలకే పరిమితమై పోకుండా భిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది కాజల్ అగర్వాల్. అప్పటి ‘లక్ష్మీ కళ్యాణం’ నుంచి ఇప్పటి ‘కవచం’ వరకు జరిగిన ప్రయాణాన్ని చూస్తే కాలంతో పోటీ పడే కిటుకేదో ఆ కళ్లకు తెలిసినట్లే ఉంది. ‘ఒకే మూసలో నటించాలని లేదు’ అంటున్న కాజల్ అంతరంగ తరంగాలు ఇవి... ఆ విధంగా... సినిమా ప్రభావం నిజ జీవితం మీద ఎంత ఉంటుందనే గంభీరమైన చర్చ మాట ఎలా ఉన్నా... సినిమాల పుణ్యమా అని కొత్త విద్యలు నేర్చుకున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్, తుపాకి... మొదలైన సినిమాల ద్వారా సైకిలింగ్, స్కూటర్ రైడింగ్ నేర్చుకున్నాను. అంతకుముందు జంతువులంటే భయంగా ఉండేది... సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆ భయం హుష్‌కాకి అయిందన్నమాట. షూటింగ్ లేని సమయంలో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతాను. చిత్ర దివకరుని రచనలు అంటే ఇష్టం. పెళ్లంటే ఏమిటంటే... కెరీర్‌కు, పెళ్లికి ముడిపెట్టవద్దు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ‘పెళ్లికి రైట్ టైమ్ ఏమిటి?’ అనే ప్రశ్నకు నా సమాధానం: ‘రైట్ పర్సన్’. పెళ్లయితే కెరీర్‌కు çఫుల్స్టాప్ పెట్టాలనే రూల్ ఏమీలేదు. నటులను కార్పొరేట్ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? పెళ్లైనంత మాత్రాన కార్పొరేట్ ఉద్యోగులు తమ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పరు కదా! నటుల విషయంలో మాత్రం ‘పెళ్లి’ అనగానే ‘ఇక సినిమాల్లో నటించరన్నమాట’ అనే మాట వినిపిస్తుంది. ఇది తప్పు. పెళ్లైన తరువాత కూడా నటిస్తున్న నటీమణులను చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. గ్లామర్ గ్రామర్ చీరలో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. ‘గ్లామరస్’ కోసం బికినీ మాత్రమే ధరించనక్కర్లేదు. గ్లామర్ అనే పదాన్ని వేరే అర్థంలో చూస్తున్నాం. స్కిన్ షోకు ఒక పరిధి ఉంది. డీసెంట్‌గా ఉంటే ఓకే. డీసెన్సీ, వల్గారిటీ మధ్య గీత ఉంది. ఆ గీత దాటితే వల్గారిటీ. ఎన్నో స్టేజీ ప్లేలలో నటించినప్పటికీ సినిమాల్లోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎంబీయే చేసి మార్కెటింగ్‌లోకి వెళ్లాలనుకున్నాను. కానీ విధి ఇలా డిసైడ్ చేసింది! పాత్రల ఎంపిక విషయానికి వస్తే క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఇచ్చే పాత్రలు అంటే ఇష్టం. రోల్ మోడల్స్ చిత్రసీమలో నా రోల్‌మోడల్స్ జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా... ఇలా నా జాబితాలో చాలామందే ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయంలో స్ఫూర్తి పొందుతుంటాను. కొన్ని ప్రశ్నలు చిత్రంగా అనిపిస్తాయి. ఉదాహరణకు... బాలీవుడ్లో చేస్తున్నప్పుడు ‘సౌత్‌లో ఎందుకు చేయడం లేదు?’ అని అడిగేవాళ్లు. సౌత్‌లో బిజీ అయినప్పడు ‘బాలీవుడ్లో ఎందుకు చేయడం లేదు?’ అని అడుగుతుంటారు. -
సమస్యలకు సెల్యూట్!
జీవితంలో సమస్యలు, సంతోషాలు సహజం. అయితే ఈ రెంటినీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు. కొందరు ఎంత పెద్ద సమస్యనైనా లైట్ తీసుకుంటారు. కొందరు చిన్న సమస్యకు కూడా నానా హైరానా పడిపోతారు. కానీ, సమస్యలకు సెల్యూట్ చెప్పేవాళ్లు ఉంటారా? కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది చెబుతారు. గత బుధవారంతో ఈ బ్యూటీ తెరపై కనిపించి పదేళ్లవుతోంది. తెలుగు పరిశ్రమకు కాజల్ కథానాయికగా పరిచయమైన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం 2007 ఫిబ్రవరి 15న విడుదలైంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఇన్నేళ్ల కెరీర్లో నాకు ఎదురైన సమస్యలకు సెల్యూట్. అలా ఎందుకంటున్నానంటే అవి లేకపోతే నాలో పరిణతి వచ్చేది కాదు. నేను స్ట్రాంగ్ గాళ్‌ని అయ్యేదాన్ని కాదు. ఇన్నేళ్లల్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్, డల్ మూమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే డల్ మూమెంట్స్ పాఠాలు నేర్పిస్తాయి. అందుకే నాకెదురైన హ్యాపీ మూమెంట్స్‌కి కాకుండా స్ట్రగుల్స్కి థ్యాంక్స్ చెబుతున్నా’’ అన్నారు.