Lakme
-
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025 -
నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్‌డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
కడపలో పాయల్ రాజ్‌పుత్ సందడి
అందాల తార పాయల్ రాజ్‌పుత్ ఆదివారం కడపలోతళుక్కుమన్నారు.ఒక బ్యూటీ సెలూన్ప్రారంభించేందుకు వచ్చినరాజ్పుత్ అభిమానులతో సందడి చేశారు.ఆమె అభివాదం చేయగానే యువకులు కేరింతలు కొట్టారు. కడప కార్పొరేషన్ : ఆర్ఎక్స్100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడపలో సందడి చేసింది. అందం, గ్రూమింగ్ విభాగాల్లో అత్యత్తమ సేవలందించే లాక్మే సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. పాయల్ రాజ్‌పుత్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున యువత కోటిరెడ్డి సర్కిల్‌కు చేరుకున్నారు. ఆమె అభివాదం చేయగానే పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆమె సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్మే సెలూన్ తన ఫేవరెట్ అని, ఇక్కడ గ్లామరస్ హైలెట్స్ మొదలు పునరుత్తేజం కలిగించే ఫేసియల్స్, మెడిక్యూర్, పెడిక్యూర్ వంటి సేవలు అందించడంలో లాక్మే సెలూన్ అగ్రగామిగా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన షోరూం ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లాక్మే సీఈఓ పుష్ఫరాజ్ షెనాయ్, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి, ఫ్రాంఛైజీ భాగస్వామి శ్రీ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో లాక్మీ బ్రైడల్ షో
-
లాక్మే ఫ్యాషన్ వీక్


