నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే! | Lakme Company Born From Nehru Idea And JRD Tata Vision, Success Story Of Makeup Brand Lakme In Telugu - Sakshi
Sakshi News home page

Lakme Success Story In Telugu: లాక్మే కంపెనీకి లక్ష్మీదేవికి సంబంధమేంటి? స్వాతంత్య్రం వచ్చిన తరువాత..

Aug 26 2023 4:15 PM | Updated on Aug 26 2023 5:28 PM

Lakme company born Nehru Idea and JRD Tata vision - Sakshi

బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జెఆర్‌డీ టాటాతో చర్చ..
భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు.

లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే?

లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో..
నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..!

ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement