breaking news
kuwait airways
-
కువైట్‌లో అత్యవసరంగా దిగిన విమానం
దుబాయి : కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్‌లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్‌ను ఢీ కొట్టిందని పేర్కొంది. ఈ మేరకు కువైట్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. -
కాక్‌పిట్‌లో పొగ.. అత్యవసర ల్యాండింగ్
విమానం కాక్‌పిట్‌లోంచి పొగ రావడంతో దాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కువాయిట్ ఎయిర్వేస్ విమానంలో ఇలా కావడంతో దాన్ని బ్రసెల్స్ విమానాశ్రయంలో దించేశారు. కువాయిట్ నుంచి 200 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఈ విమానం కాక్‌పిట్ లోంచి పొగ వస్తున్నట్లు పైలట్ గుర్తించారు. అప్పటికి విమానం బ్రెజిల్‌కు సమీపంలో ఉండటంతో.. ముందుగా ఏటీసీ నుంచి అనుమతి తీసుకుని బ్రసెల్స్ విమానాశ్రయంలో దించినట్లు ఆ విమానాశ్రయం అధికార ప్రతినిధి ఫ్లోరెన్స్ మల్స్ తెలిపారు. విమానాన్ని క్షేమంగా దించిన తర్వాత అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేసి, వారిని బస్సుల్లో విమానాశ్రయం భవనానికి తరలించి అప్పుడు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అప్పుడు పొగకు కారణం కార్గో విభాగంలో ఉన్న వస్తువని తెలిసింది. ఆ తర్వాత మొత్తం ప్రయాణికులను కలిసేందుకు బ్రసెల్స్‌లో ఉన్న కువాయిట్ రాయబార కార్యాలయం తన ప్రతినిధులను విమానాశ్రయానికి పంపింది.