breaking news
Krishnavaram
-
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
-
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కోడిపందాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నలుగురు యువకులు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని నూజివీడు తరలించారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న ఆగిరిపల్లి పోలీసులు కృష్ణవరం చేరుకున్నారు. ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు కృష్ణవరంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.