breaking news
krishna river encroachment
-
కృష్ణమ్మ కబ్జాపై సాక్షి ఎఫెక్ట్
-
ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘సాక్షి’ కథనం
-
ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘సాక్షి’ కథనం
అమరావతి: ‘కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారుల్లో కదిలిక మొదలైంది. నదిలో నది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్ర జెండాలు ఏర్పాటు చేయడం అధికారుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతలు కబ్జాకు పాల్పడ్డారని వెల్లడికావడంతో విషయం పెద్దది కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టినట్టు సమచారం. కబ్జాదారులు వేసిన ఫెన్సింగ్ ను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారు. నది కబ్జాపై విచారణను అధికారులు గాలికొదిలేశారు. రిసార్ట్స్‌ల కోసం నదినే పూడ్చి వేయటానికి అధికార పార్టీ నాయకులు బరితెగించడాన్ని పర్యావరణవేత్తలు, రైతులు, మత్స్యకారులు, స్థానికులు ఖండిస్తున్నారు. సంబంధిత కథనం: కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా