breaking news
Krishna Pushkara Harathi
-
పుష్కర హారతి బాగుంది: రవిశంకర్
-
పుష్కర హారతి బాగుంది: పండిట్ రవిశంకర్
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇస్తున్న పుష్కర హారతి బాగుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తెలిపారు. అలాగే పుష్కర ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్లో రవిశంకర్ పుష్కరస్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్టాడుతూ.. గోదావరి పుష్కరాలతో పోలిస్తే క్రౌడ్ మేనేజ్మెంట్... చక్కగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. గోదావరి పుష్కరాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పండిట్ రవిశంకర్ గుర్తు చేశారు.