breaking news
Kotak Life insurance
-
పాలసీ దారులకు షాక్?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను పెంచాలనుకుంటున్నట్టు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు. నూతన పాలసీకి అనుమతి కోసం త్వరలోనే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ముందు దరఖాస్తు చేసుకోనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు, బీమాపై బీమాను ఆఫర్ చేసే సంస్థలు (రీఇన్సూరెన్స్) తీవ్రంగా ప్రభావితమైనట్టు చెప్పారు. తమ ఉత్పత్తుల ప్రీమియం ధరలు, అండర్‌రైటింగ్ (చెల్లింపుల బాధ్యతను స్వీకరించడం) నిబంధనలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టు వివరించారు. గడిచిన కొన్ని నెలలుగా భారీ ఎత్తున క్లెయిమ్‌లు రావడంతో ఇప్పటికే చాలా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియంను పెంచినట్టు చెప్పారు. ‘‘చివరిగా మేము గతేడాది ఏప్రిల్‌లో ప్రీమియం పెంచాము. పరిస్థితులను మదింపు వేసిన అనంతరం నూతన ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసుకుంటాము’’ అని చెప్పారు. ధరల పెంపు కాకుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించేలా తమ ఉత్పత్తి ఉంటుందన్నారు. 2021–22 మొదటి ఆరు నెలల్లో 62,828 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1,230 కోట్లను ఈ సంస్థ చెల్లించడం గమనార్హం. చదవండి: మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు -
మార్కెట్లోకి కోటక్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కోటక్ లైఫ్ ఇన్య్సూరెన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సునీల్ శర్మ బుధవారమిక్కడ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం దేశ జనాభాలో 53 శాతం మందికి పెన్షన్ ప్లాన్స్ లేవని.. దీన్ని కోటక్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ‘‘35 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్లకు ప్రీమియర్ పెన్షన్ ప్లాన్‌ను తీసుకుంటే.. ఏటా రూ.75 వేలు పదేళ్ల పాటు చెల్లించాడనుకుంటే.. అతనికి 60 ఏళ్లకు ప్రీమియం రూ.30.8 లక్షలవుతుంది. అంటే ఆ వ్యక్తి జీవితాంతం ఏటా రూ.2.4 లక్షలు పెన్షన్‌ను పొందుతాడని’’ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్ గురించి ఉదహరించారు. తొలి ఐదేళ్లు ప్రతి ఏటా 5 శాతం బోనస్ వస్తుందని.. ఒకవేళ ఆ వ్యక్తి అర్థంతరంగా మరణిస్తే ఒక్క ప్రీమియం చెల్లించినా సరే 105 శాతం ప్రీమియం బెనిఫిట్ అందుతుందని పేర్కొన్నారు.