breaking news
korm stadium
-
రాణించిన అనంతపురం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ మ్యాచ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం నగరంలోని కేఓఆర్ఎం క్రీడామైదానంలో కడప, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. జట్టులోని పి. గిరినాథరెడ్డి మరోసారి చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 130 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఈయనకు జతగా మహబూబ్‌పీరా 59 పరుగులు, ప్రవీణ్ 56, షకీర్ 50 పరుగులు చేయడంతో అనంతపురం చక్కటి స్కోరును చేయగలిగింది. కాగా కడప బౌలర్ హరిశంకర్‌రెడ్డి 6 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో విశాఖ... కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో విశాఖ–గుంటూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు 35.3 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని మణికంఠస్వామి 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విశాఖ బౌలర్లు అజయ్‌కుమార్ 5, ప్రశాంత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి 47 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. జట్టులోని వంశీకృష్ణ 56 పరుగులు చేశాడు. గుంటూరు బౌలర్ ప్రణయ్‌కుమార్ 2 వికెట్లు తీశాడు. దీంతో తొలిరోజు ఆటముగిసింది. -
విజయం దిశగా విశాఖ
కడప స్పోర్ట్స్: కడప నగరం కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు కడప–వైజాగ్ జట్ల మధ్య నిర్వహిస్తున్న మ్యాచ్‌లో విశాఖ జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం ప్రారంభమైన మ్యాచ్‌లో విశాఖ జట్టు 32 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. 58.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని జోగేష్ 49, ఆశిష్ 35, అజయ్‌కుమార్ 24, ధీరజ్ 27 పరుగులు చేశారు. కడప బౌలర్లు ఆరీఫ్ 5 వికెట్లు, హరి 2 రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. జట్టులోని సాయిసుధీర్ 5, నూర్‌బాషా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా విశాఖ జట్టు తొలి ఇఇన్నింగ్స్లో 112 పరుగులు చేయగా, కడప తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు చేసిన విషయం విదితమే. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. రసవత్తరంగా అనంతపురం, గుంటూరు మ్యాచ్.. కేఎస్ఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అనంతపురం, గుంటూరు జట్ల మధ్య సాగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. వర్షం కారణంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 381 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 100.4 ఓవర్లలో 425 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని ముదాసిర్ 73 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు ధాటిగా ఆడుతూ 17 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులోని మహీప్‌కుమార్ 38, నోవా 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.