అమరావతిలో విదేశీయుల సందడి
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిని శనివారం దేశ విదేశాల పర్యాటకులు సందర్శించారు. రాజధానిని సందర్శించిన అనంతరం ఉదయం 11 గంటలకు కొరియాకు చెందిన పారిశ్రామిక వేత్తల బృందం, సాయంత్రం టిబెట్‌కు చెందిన యాత్రికులు తొలుత అమరావతి కొత్త, పాత మ్యూజియంలలోని శిల్పాలను, ధ్యానబుద్ధ విగ్రహన్ని సదర్శించారు. ప్రతి ఏడాది సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమరావతిని సందర్శించే విదేశీయుల సందడి ఎక్కువనే చెప్పవచ్చు.