breaking news
koram kanakayya
-
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కనకయ్య ‘కారు’ ఎక్కేనా..?
ఇల్లెందు: ఇల్లెందు కాంగ్రెస్‌లో ‘రేణుక తుపాన్’ మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్య తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గత రెండు నెలల క్రితం పీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇల్లెందు నియోజకవర్గంలో రేణుక వర్గానికి చెందిన 12 మందిని పీసీసీ ఇటీవల సస్పెండ్ చేసింది. అయితే తమ అనుచరులపై వేటు వేయడాన్ని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీవ్రంగా ఆక్షేపించారు. జిల్లాలో తాను ఉన్నంత కాలం కార్యకర్తలకు ఎలాంటి ఢోకా లేదని ఆమె భరోసా ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని రేణుక వెనకేసుకొస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న కేసీఆర్.. బంగారు తెలంగాణ పట్ల తనకున్న విజన్‌ను ఎమ్మెల్యే ముందుంచారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని, టీఆర్ఎస్లోకి రావాలని కనకయ్యను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అయితే తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని సీఎంకు చెప్పారని సమాచారం. కాగా, ఎమ్మెల్యే అనచరుల్లో ముఖ్యమైన నేతలు టీఆర్ఎస్ వైపు అడుగు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధితో పాటు నియోజకవర్గ ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని, కేసీఆర్ ఆహ్వానం మేరకే గులాబీ తీర్థం పుచ్చుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే అనుచర నాయకుడు ఒకరు తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన వీరంతా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.