breaking news
Komiti Reddy Venkat Reddy
-
‘బతుకమ్మ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ జి. ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్విజయవంతం చేయాలని..మంత్రి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. -
కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన జగదీశ్ రెడ్డి
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఫై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. గ్రామ గ్రామాన నిలదీయాలని విన్నవించారు. కోమటిరెడ్డి రెడ్డి నీ బెదిరింపులు నీ నాటకాలు నీ పక్కన వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర చూయించు అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జులుం తెరాస పార్టీపై చూయించడం మంచిది కాదని, దాడులు చేస్తే ఇలానే ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. తాము ప్రజలకు మంచి చేస్తున్నామని..ఎవ్వరికీ భయపడమన్నారు. బత్తాయి మార్కెట శంకుస్థాపన సభలో కాంగ్రెస- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహా బాహీ జరగడంతో మంత్రి జగదీశ్ రెడ్డి పై విధంగా స్పందించారు. -
కోమటిరెడ్డిపై మంత్రి ఫైర్
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రవర్తించిన తీరుఫై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మార్కెట్ శంకుస్థాపన సభను చెడగొట్టాలని ఉద్దేశ్యంతో గొడవ చేశాడని ఆరోపించారు. తాము రైతుల బాగు కోసం కృషి చేస్తుంటే అడ్డుకోవడం సరి కాదన్నారు. రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవనే ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణా అదో గతి పాలైందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపాలని కోరారు. కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్నదని కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ఆరోపించారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం మిర్యాలగూడ డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు డీఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.


