breaking news
komarada village
-
పనులు చేసినా పైసలు లేవు
సాక్షి, కొమరాడ: గ్రామాల్లో వలస నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో కూలీలకు వంద రోజులు పనులు కల్పించడంతో వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునని ప్రభుత్వం సంకల్పించింది. అయితే పథకం కూలీలకు చేతి నిండి పనులున్నా కూడా వలసలు ఆగడం లేదు. దీనికి కారణంగా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడమే. కూలీలు ఉన్న చోటికి ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు నెలల నుంచి వేతనదారులు కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్లు అనిపించడం లేదని వేతనదారులు మండిపడుతన్నారు. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండంల్లోని నెలలు తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చేస్తున్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూలి డబ్బులు కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పనులు చేసినా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో గ్రామీణులు వలస బాట పడుతున్నారు. పనులు ఫుల్.. డబ్బులు నిల్.. ఆరు నెలలుగా సరైన వర్షం లేకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలు పొట్టకూడి కోసం ఉపాధి పనులవైపు మొగ్గు చూపారు. అయితే పనులకు ఇబ్బంది లేకపోయినా డబ్బులు విషయానికి వచ్చే సరికి వారికి తిప్పలు తప్పడం లేదు. దీంతో పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా ప్రభుత్వం లక్ష్యం మరుగు పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ వేతనదారులకు 100రోజులు నుంచి 200 రోజులు పనికల్పించి వారం వారం బిల్లులు చెల్లించాలి. కానీ క్షేత్ర స్థాయిలో కనీసం 100రోజులు కూడా పని కల్పించడం లేదు. చేసిన పనులకు బిల్లులు అందడం లేదు. కొమరాడ- సంఘాలు 960 వేతనదారులు 6542 బకాయాలు రూ.1.65కోట్లు కురుపాం.. సంఘాలు 661 వేతనదారులు 4468 బకాయాలు రూ.2కోట్లు జియ్యమ్మవలస: సంఘాలు 788 వేతనదారులు 4991 బకాయాలు రూ.2.08 కోట్లు గరుగుబిల్లి.. సంఘాలు 828 వేతనదారులు 6042 బకాయిలు రూ.2.30 కోట్లు గుమ్మలక్ష్మిపురం.. సంఘాలు 779 వేతనదారులు 6042 బకాయిలు రూ.2కోట్లు మూడు నెలలు డబ్బులు లేవు మూడునెలలు కూలీ డబ్బులు పడలేదు. కార్యాలయాలు, బ్యాంకు చుట్టూ తిరుగుతన్నా డబ్బులు పడడంలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబ పోషణ భారమైంది. నిత్యవసర వస్తువులు కూడా కొనక్కోలేక పోతున్నాం.– ఆకులు జయలక్ష్మి, వేతనదారులు, గుణానపురం ఇబ్బంది పడుతున్నాం నెలల తరబడి ఉపాధి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేదు.– బుగత ఆదినారాయణ, వేతనదారుడు, గుణానపురం అధికారులు స్పందించాలి ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు అందక వలస బాట పడుతున్నారు. పొట్ట కూటి కోసం వారు కష్ట పడినా డబ్బులు రావడం లేదు. కూలి డబ్బులు ఇవ్వకపోతే వారు ఎలా బతికేది. – అధికారి శ్రీనివాసురావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శివిని -
నది దాటడమే పెద్ద 'పరీక్ష'
విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నాగావళి నది దాటితేగాని పరీక్ష రాయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9.30 గంటల లోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవలసి ఉండడంతో నదికి ఆవతలివైపు ఉన్న విద్యార్థినీ విద్యార్థులు గురువారం అష్టకష్టాలు పడ్డారు. నది అవతల గల కొట్టు, తొడుము, కెమిశిల, శిగవరం, మాతలంగి, దలాయిపేట, నిమ్మలపాడు తదితర గ్రామాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థులు నది ఇవతల వైపు ఉన్న కొమరాడ పాఠశాలలో చదువుతున్నారు. మధ్యలో నాగావళి నది ఉన్నా వీరికి కొమరాడ దగ్గరగా ఉండడంతో స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. నదిలో నుంచి వస్తే కిలోమీటరు దూరం ప్రయాణిస్తే చాలు విద్యార్థులు ఓ కిలోమీటరు నడిచి పాఠశాలలకు చేరుకోవచ్చు. అదే చుట్టూ తిరిగి రావాలంటే 90 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉంటుంది. సదరు గ్రామాలకు చెందిన విద్యార్థులకు కొమరాడలోని సాంఘిక సంక్షేమ పాఠశాల , గురుకుల బాలుర పాఠశాలలను పరీక్ష కేంద్రాలను కేటాయించారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో విద్యార్థులు కొంత కష్టపడైనా సమయానికి కేంద్రాలకు చేరుకున్నారు. ఒకవేళ ఒడిశాలో వర్షాలు కురిస్తే నాగావళిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. వీరు మధ్యలో ఉండగా నీటి ప్రవాహం పెరిగితే పరిస్థితి చెప్పనక్కరలేదు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నది దాటాల్సిన పరిస్థితి నెలకొంది. నది ఆవలి నుంచి కొమరాడ వచ్చేసరికి సుమారు గంటన్నర సమయం పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా విద్యార్థులకు ఈ కష్టాలు తప్పడంలేదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.