breaking news
komal reddy
-
ఉద్యోగాల పేరిట మోసం
♦ నిరుద్యోగులకు రూ.18.96లక్షల కుచ్చుటోపీ ♦ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు కోల్‌సిటీ : ‘నాకు ఎమ్మెల్యేలు తెలుసు.. మంత్రులు బాగా పరిచయం.. ఎలాంటి ఉద్యోగమైనా ఇప్పిస్తా.. నన్ను నమ్మండి..’ అంటూనే నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు ఓ మోసగాడు. బాధితుడు కుక్కట్ల రమేష్ ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్‌కు చెందిన సన్నీ ఉరఫ్ పోతర్ల హరీష్ ఉరఫ్ కోమల్‌రెడ్డి గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన కుక్కట్ల రమేష్ సోదరుడు రాంకుమార్‌కు ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం రూ.2 లక్షలు వసూలు చేశాడు. అలాగే స్థానిక కాకతీయనగర్‌లో లావణ్య అనే యువతికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు, మామిడి శ్రీనివాస్‌కు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.70 లక్షలు, పెండ్యాల ప్రశాంత్‌కు అక్కడే ఇంకో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం సుమారు రూ.18.96లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో కుక్కట్ల రమేశ్ సన్నీని నిలదీశాడు. దీంతో సన్నీ కొద్దిరోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. తాము మోసపోయూమని గ్రహించిన రమేశ్.. పోలీసులను ఆశ్రరుుంచగా కేసు నమోదైంది. -
రేపు ‘శాతవాహన’లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జూన్ 2న శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించే ఈ సంబరాల్లో భాగంగా జూన్ 2న ఉదయం 8 గంటలకు శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.వీరారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ పరీక్షలు వాయిదా తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా శాతవాహన పరిధిలో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షలు వారుుదా వేసినట్లు ఎస్‌యూ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. జూన్ 10 నుంచి నాలుగో సెమిస్టర్, 11 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలు జూన్ 9 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ బాధ్యుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.