ఇంట్లో చొరబడి రూ.45 లక్షలు చోరీ
కాజులూరు: తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సంతులూరు వెంకటనరసింహారావు కుటుంబం సహా బంధువుల ఇంట్లో శుభకార్యానికి శనివారం సాయంత్రం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన అగంతకులు ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలకు ప్రవేశించి సుమారు రూ.45 లక్షల విలువైన సొత్తును అపహరించారు. ఇందులో రూ.15లక్షల నగదు.. వెండి, బంగారు నగలు ఉన్నట్లు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.