breaking news
kodanda rao
-
‘ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్’
హైదరాబాద్: కోదండరాం మొదటి నుంచి రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు తేట తెల్లమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. పార్టీ పెట్టడంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలు నిజమని నిరూపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఆనాడు కేసీఆర్ టీజేఏసీ ని ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. కోదండరాం ను చైర్మన్ గా చేసింది కేసీఆర్ యే అన్నారు. తెలంగాణ ఏర్పాటుకాగానే జేఏసీ అవసరం తీరిపోయిందని.. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైదొలిగినా ప్రజా సంఘాలతో కొనసాగుతున్న జేఏసీ రాజకీయాలే లక్ష్యంగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రొఫెసర్ గా నిజాలు చెప్పాల్సిన కోదండరామ్ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని.. ఉద్యోగ నియామకాల పై ఆయన చేస్తున్న ప్రకటనలు తప్పని నిరూపించేందుకు వాస్తవాలతో కూడిన పత్రం పంపిస్తామన్నారు. దాదాపు 32 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, కోదండరాం కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ గా మారారని విమర్శించారు. ' నాలుగు రోజుల కింద ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన మాటలే ఇపుడు కోదండరాం మాట్లాడుతున్నారు.. కోదండరాం ముసుగు తొలిగింది.. ఆయన పట్ల ప్రజల్లో భ్రమలు కూడా తొలిగి పోయాయి. కోదండ రామ్ కు పార్టీ పెట్టె హక్కు ఉంది. పార్టీ పెట్టి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు తనవారికి ఇప్పించుకోవాలన్నదే కోదండరాం తపన. రాజకీయేతర సంఘాల ముసుగులో కోదండరాం రాజకీయాలు చేయడంమీదే మా అభ్యంతరం.. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కోదండరాం ర్యాలీ కి పిలుపు నిచ్చారు. హింసను ప్రేరేపించేందుకు యత్నిస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరాం ర్యాలీ కి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనేది పరిస్ధితులను బట్టి డీజీపీ నిర్ణయం తీసుకుంటారు. అబద్దాలతో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అశాంతి నెలకొంటున్నదంటూ కోదండ రామ్ మాట్లాడుతుండడం విడ్డూరం. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. అంతవరకు కోదండరాం కు తొందరపాటు తగదు' అని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. -
ఇది ప్రజా విజయం
గుండాల, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులను మరిచిపోతే మన లక్ష్యాన్ని మరిచిపోయినట్లేనని, తెలంగాణ ఏర్పాటు ఏ ఒక్కరిదీ కాదని.. ఇది ప్రజల విజయమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గుండాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. వేణుగోపాల్ రెడ్డి, యాదన్న, యాదిరెడ్డి, శ్రీకాంతాచారి తదితరుల ఆత్మహత్యలన్నీ నిరసన రూపాలని అన్నారు. వారి త్యాగాలు ఉద్యమానికి ఊపిరిపోశాయని అన్నారు. 1969 నాటి సంఘటనలకు.. ఇప్పటి ఘటనలకు చాలా తేడా ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మె కూడా చారిత్రాత్మకమైనదని, ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి జయశంకర్, ఇతర అమరవీరుల సాక్షిగా కృషి చేస్తామని ప్రకటించారు. చదువుకున్న వారు మౌనంగా ఉంటే టైజం కంటే ప్రమాదమని అన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా, తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకె ళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ ఊపిరి పోస్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కదలించిందని అన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దీక్ష చేపడితే.. ఆ దీక్షను న్యూడెమోక్రసీ ముందుకు నడిపిందని చెప్పారు. జేఏసీలో లేకపోయినప్పటికీ సీపిఐ నిర్వహించిన పోరాటం కూడా మరువలేనిదని అన్నారు. చివరి సమయంలో ప్రజలు సంఘటితంగా ఉండడ ంల వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, పంపకాల్లోనూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన భాద్యత ఉందని అన్నారు. పోలవరం నిర్మాణంతో ఆదివాసీల మనుగడకు ముప్పు ఏర్పడిందని, ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోదావరి జలాలలపై ఆంధ్రా ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతాన్ని ముంపు పేరుతో తరలించుక పోవడం సరైంది కాదన్నారు. గ్రామాల తర లిపుంపును నిలిపివేసేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు యాసారపు తిరుపతి, సాయన్న, డి.శ్రీను, నాగరాజు అద్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, రేగా కాంతారావు, ఊకె అబ్బయ్య, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నాయకులు ఎన్.వెంకటపతిరాజు, న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు ముక్తార్‌పాషా, ముక్తి సత్యం పాల్గొన్నారు.