breaking news
kirthana
-
ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య
ఖాజీపేట: ప్రేమోన్మాది చేతిలో ఓ బాలిక దారుణహత్యకు గురైంది. ఈ దుర్ఘటన వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది. శుక్రవారం ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్‌ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్‌కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.ప్రేమోన్మాదమే హత్యకు కారణంఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కాళ్లుపట్టుకున్న తల్లిదండ్రులు బాలిక హత్యతో శ్రీనివాసులు బంధువులు, గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఖాజీపేట పోలీస్‌స్టేసన్‌కు తరలివచ్చి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరు సరిగా లేదని ఖాజీపేట బస్టాండ్ కూడలిలో రాస్తా్తరోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు టౌన్లోకి వాహనాలు రాకుండా జాతీయరహదారి నుంచి ట్రాఫిక్ మళ్లించారు. దీంతో బాలిక బంధువులు జాతీయ రహదారి దిగ్బంధించారు. సుమారు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తా్తరోకో చేశారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని భీష్మించారు. ఓ దశలో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జీ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు యత్నించారు. అయితే బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించారు. రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి తప్పకుండా న్యాయం చేస్తామని దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. మాకు న్యాయం కావాలిమా ఇంటికే వచ్చి నా కూతురి గొంతుకోసి వెళ్లడం దారుణం. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వాడిని వదిలేదే లేదు. మాకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష పడాలి. అంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటాం. – శ్రీనివాసులు–నాగమణి, బాలిక తల్లిదండ్రులు -
రెండేళ్ల క్రితం మాయమై..
చెన్నై(అన్నానగర్): రెండేళ్ల క్రితం మాయమైన యువకుడు హిజ్రాగా తిరిగి వచ్చిన సంఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని చిన్న కుమారుడు ముత్తుకుమార్ (20)తిరుపూరులోని బనియన్ సంస్థలో పని చేస్తున్నాడు. 2015 మార్చి నెలలో పనికి వెళ్లిన ముత్తుకుమార్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో వెతుకుతున్న క్రమంలో ముత్తుకుమార్ చెన్నై వ్యాసర్పాడిలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుక్నున్నారు. హిజ్రాగా మారిన అతన్ని విచారణ చేయగా మహిళగా మారాలనే ఇంటి నుంచి బయటకి వచ్చానని, పేరును కీర్తనగా మార్చుకున్నానని తెలిపాడు. చెన్నైలో ఒకరి సహాయంతో మదురైకి వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానన్నాడు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని పోలీసుల విచారణలో చెప్పాడు. ముత్తుకుమార్ దొరికాడన్న సంతోషంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు హిజ్రాగా మారిన అతన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు ముత్తుకుమార్‌ను తిరుప్పూరు కోర్టులో హాజరు చేశారు. ముత్తుకుమార్ తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో అతను చెన్నైకి వచ్చాడు.


