హ్యాపీడేస్ గుర్తొచ్చాయి – నిఖిల్
‘‘ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. చాలా ఫ్రెష్‌గా ఉంది. నిఖిల్‌కు ఫ్రెండ్స్‌గా నటించినవాళ్లంతా న్యాచురల్‌గా, ప్రెష్‌గా కనిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుందని, టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు’’ అని దర్శకుడు తేజ అన్నారు. నిఖిల్, సిమ్రాన్ పరీన్జా, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శరణ్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను గ్యాంగ్ లీడర్‌గా కనిపించినా మా అందరి లీడర్ మాత్రం అనిల్ సుంకరగారే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘హ్యాపీ డేస్’ మూవీ చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. షూటింగ్ పూర్తవ్వగానే అందరం ఏడ్చేశాం. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది’’ అన్నారు.
‘‘ఎంతో అనుభవం ఉన్నవాళ్లు ఈ సినిమాకు పని చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లో ‘కిరాక్ పార్టీ’ బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పగలం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’. ఆ సినిమా ఫ్లేవర్ పోకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా తీశాం. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో నిఖిల్‌కు చాలా థాంక్స్’’ అన్నారు శరణ్. ఈ సినిమాకు సంగీతం: అంజనీష్ లోకనా«థ్, స్క్రీన్‌ప్లే: సుధీర్ వర్మ, డైలాగ్స్: చందూ మొండేటి.