కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమేనట! | Kirrak Party Teasing Trailer is out | Sakshi
Sakshi News home page

కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమేనట!

Jan 31 2018 7:14 PM | Updated on Mar 22 2024 11:29 AM

‘కృష్ణుడొచ్చాడురా... ఇక కురుక్షేత్రమే’  అంటున్నాడు హీరో నిఖిల్‌. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘కిరాక్‌ పార్టీ’.  కాలేజీ రాజకీయాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా క‌న్నడంలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌. నిఖిల్‌, సంయుక్తా హెగ్డే, సిమ్రన్‌ ప‌రీంజా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం టీజింగ్‌ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.  నిమిషం నిడిడి ఉన్న ఈ ట్రైలర్‌.. ప్రేక్షకులకు మరోసారి కాలేజీ రోజుల్లోని మధురానుభూతులను గుర్తుతెచ్చేలా ఉంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాలీగా, అల్లరిచిల్లరిగా కాలేజీ జీవితాన్ని ఎంజాయ్‌ చేసే విద్యార్థిగా, మాస్‌ లుక్‌ కలిగిన స్టూడెంట్ లీడర్‌గా విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రను నిఖిల్‌ పోషిస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement