breaking news
Kingfisher Airlines chief vijay mallya
-
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
మీ చేతులకు రక్తం అంటుకుంది
‘కింగ్’ ఫిషర్ మాల్యాకు ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల లేఖ బెంగళూరు: వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యాపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధతో, ఆక్రోశంతో లేఖ రాశారు. మాల్యా హృదయం మలినమైందని, చేతులకు ఉద్యోగుల రక్తం అంటుకుందంటూ తీవ్రంగా స్పందించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఉద్యోగుల మాటల్లోనే: మిస్టర్ మాల్యా!..కింగ్‌ఫిషర్ ఉద్యోగులుగానే కాకుండా పన్ను కడుతున్న ఈ దేశ పౌరులుగా ఈ ఉత్తరం మీకు రాస్తున్నాం. * మీరు మా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంతో మేం తీవ్రమైన బాధ, ఆక్రోశంలో ఉన్నాం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కేఎఫ్ఏ) గురించి మాట్లాడుతూ ‘ఎలాంటి విచారం’ లేదన్న మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి. * మా వరకు మాకు కేఎఫ్ఏ ఇంకా ఉనికిలోనే ఉంది. జీతాలు చెల్లించకపోయినా జీతాల పట్టిలో మా పేర్లు ఉన్నాయి. * సంస్థను మళ్లీ ప్రారంభిస్తామని మీరు హామీ ఇచ్చినా.. మీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. * దేశంలోని కుళ్లిన వ్యవస్థ గురించి మాకు తక్కువ తెలుసు... కానీ మీలాంటి వ్యక్తుల పుణ్యమాఅని దేశంలో ఉన్న అసలు పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో అర్థమైంది. అది సామాన్యమానవుడికి ఆత్మహత్యాసదృశంగా మారింది. ఆ సామాన్యుడు నిజాయతీగా, క్రమం తప్పకుండా చెల్లించే పన్నులను మీ లాంటివాళ్లు, రాజకీయ నాయకులు బ్యాంకులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. * సీబీఐ ఇచ్చిన అన్ని సలహాల పట్ల బ్యాంకులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాయో విస్మయం కలిగిస్తోంది. అవినీతికి పాల్పడ్డ బ్యాంకర్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. * సొంతంగా చర్యలు తీసుకోవడంలో సీబీఐ అంత బలహీనంగా ఉందా? ఎందుకు మీపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు? * ఎందుకు సాధారణ పౌరుడే ఆదాయపు పన్ను శాఖకు భయపడాలి.? * పన్నులు చెల్లించే వారిని అపహాస్యం చేయటం కోసమేనా ఎస్బీఐ ఇంత ఆలస్యంగా తీవ్రస్థాయిలో స్పందించింది? * పన్ను చెల్లించేవారి విషయంలో ప్రభుత్వం ఎందుకు జవాబుదారీగా ఉండదు? * మా ప్రశ్నలకు ఆర్థిక శాఖ, పీఎంఓ జవాబులు చెప్పాలి. పన్నుచెల్లింపుదారులకు ఈ వ్యవస్థపై తిరిగి విశ్వాసం పాదుకొల్పాలి. * మీలాంటివారు మా డబ్బుతో కంపెనీ పెట్టి దోపిడీచేసి సిగ్గులేకుండా మూసేస్తున్నారు. * ‘జీతాలు చెల్లించేందుకు నా దగ్గర డబ్బులేదన్న’ మీ మాటలకు అర్థం ఏమిటి? కరేబియన్ ప్రీమియర్ లీగ్, విలాసవంతమైన పడవ కోసం డబ్బులెక్కడి నుంచి తెచ్చి ఖర్చుపెట్టారు? * ఈ కుళ్లిన వ్యవస్థలోని బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు, ఎయిర్పోర్ట్ అథారిటీ, పోలీసులు, మీడియా సంస్థలు.. వెన్నుదన్నుతో మీరు హాయిగా తప్పించుకోగలుగుతారు. * మీడియా సంస్థలు ఎందుకిలా వ్యవహరిస్తున్నాయో అర్థం కావటం లేదు. సామాన్యుడి పట్ల ఉదాసీనతా? లేక మీరు వారిని ప్రభావితం చేయటం వ్లనా? మిమ్మల్ని హీరోగా, బాధితుడిగా ఎలా చెప్పగలుగుతున్నాయి? * అదే సమయంలో మన సైనికులు, ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు వీటి గురించి ఎందుకు పట్టించుకోవు.. * కార్పొరేట్ ప్రపంచంలో మాదిరిగా సామాన్యుడిని పోలీసులు వినియోగదారుడిగా భావించేలా సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు మీడియా సంస్థలు ప్రయత్నించిన నాడు మేం సంతోషిస్తాం. * మీలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. దేశ ప్రతిష్టకు ముఖ్యంగా విమానయాన రంగానికి ఎంతో అప్రతిష్ట తీసుకొచ్చారు... దీని వల్ల కొత్తగా రావాలనుకునే కంపెనీలు విమానాల్ని అద్దెకు తీసుకోవడమే చాలా కష్టంగా మారింది. * ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు సంపాదించిన ఈ సొమ్మును మీ కొడుకు కూడా మొత్తం ఖర్చుచేయలేడని.. అలాంటప్పుడు కనీసం మా జీతాలైనా మాకు ఇవ్వవచ్చుకదా? * మిమ్మల్ని ఇంకా గొప్పవాడిగా భావిస్తున్న ప్రజల కోసమైనా, పీహెచ్‌డీలు, అవార్డులిచ్చి సత్కరిస్తున్న అంతర్జాతీయ సంస్థల కోసమైనా మీ బాధ్యతల నుంచి తప్పుకోండి. * మా బకాయిలు చెల్లించడంలో ప్రధాని సాయం చేస్తారని భావిస్తున్నాం. లేదంటే మా హక్కులకు మేం దూరమవుతాం. మాల్యా... మీ హృదయం మలినమైంది. మీ చేతులకు రక్తం అంటుకుంది. మీకు ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాం. వినే ఓపిక, సమయమూ మీకు లేదు. త్వరగా కోలుకోండి.. - కింగ్‌ఫిషర్ ఉద్యోగులు, భారతదేశ పౌరులు