breaking news
Kidney medical expert
-
కిడ్నీ బాధిత భారతం
ఆయా సంస్థలు దేశంలో 52,273 మంది వ్యాధిగ్రస్తులను సర్వే చేశాయి. ప్రాంతం, సామాజిక ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. అందులో తూర్పు భారతం నుంచి 5,768 మంది వ్యాధికి గురికాగా, ఉత్తర భారతం నుంచి 14,588 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈశాన్య భారతం నుంచి 13,362 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే అత్యధికంగా దేశంలో దక్షిణ భారతం నుంచే 18,555 మంది మూత్రపిండాల వ్యాధికి గురయ్యారు. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేలలోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3% ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేలలోపు ఆదాయం గల 42.9% మందికి కిడ్నీ వ్యాధి సోకింది. మిగిలిన 12.7% మంది నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం గల వారున్నారని నివేదిక తెలిపింది. ఇక దక్షిణాదిలోనే షుగర్ కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నవారు 32.9 శాతమున్నారు. బీపీ ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడినవారు 11.8% మంది ఉన్నారు. 2040 నాటికి నాలుగో స్థానం 2016 లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అదే దేశంలో మొదటిస్థానంలో ఉన్న వ్యాధిగా నివేదిక తెలిపింది. ఆ తర్వాత పక్షవాతం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. అలా 16వ స్థానంలో కిడ్నీ వ్యాధి ఉంది. కానీ 2040 నాటికి కిడ్నీ వ్యాధి నాలుగో స్థానానికి వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. గుండె, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధి తర్వాత కిడ్నీ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదముందని తెలిపింది. తెలంగాణలో తక్కువే హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, నాగాలాండ్, గోవా, కేరళ రాష్ట్రాల్లో బీపీ బారినపడిన వారు అధికంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో 26% మందికిపైగా బీపీతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్, అసోంలో 24 నుంచి 26% ఉన్నారు. తెలంగాణ, రాజస్తాన్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లో బీపీ రోగులు తక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 18%లోపు మాత్రమే బీపీతో బాధపడుతున్నారు. అయితే అధిక కొవ్వుతో బాధపడేవారు తెలంగాణలో ఏకంగా 22 నుంచి 25.4 %మంది ఉన్నారు. కిడ్నీ రోగులకు వైద్యుల కొరత.. కిడ్నీ వ్యాధి విస్తరిస్తున్నా ఆ మేరకు రోగులకు చికిత్స చేసే నెఫ్రాలజిస్టులు (కిడ్నీ వైద్య నిపుణులు) మాత్రం ఆ స్థాయిలో లేరు. ప్రస్తుతం దేశంలో కోటి మందికి కిడ్నీ వ్యాధి ఉండగా, వారికి చికిత్స చేయాలంటే కనీసం 30 నుంచి 40 వేల మంది నెఫ్రాలజిస్టులు కావాలి. కానీ ఇప్పుడు 5 వేల మంది రోగులకు ఒక నెఫ్రాలజిస్టు మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే అసలు నెఫ్రాలజీ వైద్యులే లేరంటే మరీ దారుణం. తెలంగాణలో 200 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారని వైద్య వర్గాల అంచనా. ఫిజీషియన్ల పాత్ర కీలకం దేశంలో నెఫ్రాలజిస్టుల కొరత ఉన్నమాట నిజమే. కాబట్టి ఆ మేరకు కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో, అవసరమైన మేరకు చికిత్స చేయడంలో ఫిజీషియన్లు కూడా కీలకంగా ఉండాలి. రోగుల్లో వస్తున్న మార్పులను గుర్తించాలి. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించాలి. – డాక్టర్ తాడూరి గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ కుటుంబంలో ఎవరికైనా ఉంటే అనుమానించాలి షుగర్, బీపీ వంటివి ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ పరీక్ష కూడా అవసరం. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేయడానికి వీలు కలుగుతుంది.–డాక్టర్ కార్తీక్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
ఐసీయూలో అంబరీష్
ఆస్పత్రి ఎదుట అభిమానుల ధర్నా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు : సిద్దరామయ్య బెంగళూరు, న్యూస్‌లైన్ : శ్యాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ అనారోగ్యంతో ఇక్కడి విక్రమ్ ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన అంబరీష్‌ను వెంటనే ఆయన సతీమణి సుమలత పాటు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ ఆస్పత్రికి శ్వాసకోస వైద్య నిపుణుడు సతీష్ నాయక్, గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రంగనాథ్, కిడ్ని వైద్య నిపుణుడు రవీష్‌లు అంబరీష్‌కు వైద్యం అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురవుతోందని వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం వైద్యులు సతీష్ నాయక్, రంగనాథ్, రవీష్‌లు విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ కోలుకుంటున్నారని చెప్పారు. అంబరీష్ ఐసీయూలో ఉండటం వల్ల ఎవ్వరూ ఆందోళన చెందన వసరం లేదని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని వారు అన్నారు. తరలి వచ్చిన నాయకులు.. నటులు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ తదితరులు విక్రమ్ ఆస్పత్రికి వచ్చి అంబరీష్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దు విలేకరులతో మాట్లాడుతూ... డాక్టర్ల సమాచారం మేరకు అంబరీష్ ఐసీయూలో ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అంబరీష్‌ను పరామర్శించడానికి హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, క్రేజీస్టార్ రవిచంద్రన్, భారతీ విష్ణువర్దన్‌తో సహ పలువురు నటినటులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్య విషయంపై ఆందోళన చెందిన ఆయన అభిమానులు వందలాది మంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడిని చూడటానికి అవకాశం ఇవ్వాలని మండ్యకు చెందిన అభిమానులు ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు.