breaking news
khazipet
-
‘ ఇది ఎన్నో ఏళ్ల కల.. దాన్ని ప్రధాని మోదీ సాకారం చేశారు’
హన్మకొండ జిల్లా : నాలుగు దశాబ్దాల ఓరుగల్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాజీపేట రైల్వేస్టేషన్‌కు సంబంధించి కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ, ఓవర్ హాలింగ్ పనులు జరుగుతున్న క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈరోజు(జూన్ 19) కాజీపేటలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను కిషన్‌రెడ్డితో కిలిసి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కళ. ప్రధాని మోదీ ఆ కలను సాకారం చేశారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవుతుంది. 2026లో మాన్యుఫాక్చరింగ్ మొదలవుతుంది. ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుంది. అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుంది. భారత్ లోనే అతిపెద్ద మెగా మ్యాన్ ఫ్యాక్టరీగా కాజిపేట్ను రూపొందిస్తున్నాం.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో మరింత అభివృద్ధి చేస్తాం’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైంది’40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ‘ వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ మూడు యూనిట్లు మంజూరు చేశాం. మూడువలే మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరతుంది. వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాము.త్వరలో వరంగల్‌కు ఎయిర్పోర్ట్ వస్తుంది. వరంగల్‌కు మోదీ ఏం ఇచ్చారో.. వరంగల్‌కు వచ్చి చూసి మాట్లాడాలి. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేశాం. మరిన్ని రైల్వే లైన్స్ అభివృద్ధికి పనులు చేస్తున్నాం. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కమిట్మెంట్తో ఉంది. స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ సిఫార్సు చేస్తే ఉద్యోగాలు కల్పిస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
-
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, కడప : ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కడప జిల్లాలోని ఖాజీపేటలో ఆయన నివాసంలో, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. గతంలో ఆప్కోలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేశారు. ఈ క్రమంలో అధికారులు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారు, డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. (చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ) -
రాజోలి నిర్మిస్తాం..
సాక్షి, ఖాజీపేట : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజోలి జలాశయం నిర్మించి చివరి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వైఎస్సార్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, మేయర్ సురేష్‌బాబు పేర్కొన్నారు.అప్పనపల్లె పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఆయన పాలన కాలం అంతా రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీకెనాల్ ఆయకట్టు రైతుల కష్టాలను చూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి జలాశయం నిర్మించాలని శంకుస్థాపన చేశారని అన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పూర్తి చేస్తానని, పంటలను కాపాడతానని హామీ ఇచ్చారని వారు చెప్పారు.అసెంబ్లీకి 41 మంది, పార్లమెంట్‌కు ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించి బీసీలకు అగ్రతాంబూలం వేశారని అన్నారు. చంద్రబాబు బీసీల పేరుతో అందరినీ దగా చేస్తున్న విషయం గుర్తించాలని అన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు తిరిపాల్‌రెడ్డి,గురురెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు . -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం
కడప : ఫేస్బుక్ పరిచయం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖాజీపేటకు చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని.. సాయం చేయాలని అడిగింది. అమ్మాయి మాటలకు కరిగిపోయి ఇంట్లో తెలియకుండా ఆమె అకౌంట్లో డబ్బులు వేశాడు. చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడం..ఆపై యువతి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఖాజీపేట బస్టాండులో మాడిచెట్టి నరసింహ ప్రసాద్ అలియాస్ రమేష్ (33) మూడేళ్లుగా టీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ప్రతిరోజు తన మొబైల్ ద్వారా చూసేవాడు. ఇలా విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయితో అతడికి నెలక్రితం పరిచయమైంది. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనను ఆదుకోవాలని కోరింది. ఆమేరకు ఆమె ఎస్బీఐలోని గ్రీన్‌కార్డు అకౌంట్ నంబర్(20241371120)కు గతనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2లక్షలు పంపాడు. ఈ విషయంలో అతని ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. దీంతో అతను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఇదే విషయమై తరచూ మెసేజ్ పంపాడు. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని.. డబ్బు విషయమై ఇంట్లోని పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియక సోమవారం మధ్యాహ్నం బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తమ కుమారుడు బాత్రూంలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో వారు బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఆ తర్వాత అతని మొబైల్‌ను పరిశీలించగా అందులో ఆ యువతికి పంపిన మెసేజ్‌లు తదితర వివరాలు బయటపడ్డాయి. తర్జనభర్జన అనంతరం మంగళవారం ఉదయం మృతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఎవరు.? నరసింహ ఫోన్ చేసిన మొబైల్ నంబర్‌తో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నంలోని సీతంపేటకు చెందిన గార్లే కళ్యాణిగా ఉంది. కాగా బ్యాంక్ అకౌంట్‌కు ఇచ్చిన ఫోన్ నంబరు మరోలా ఉంది. ఆ యువకుడు ప్రతిరోజు ఫోన్ చేసిన నంబర్ వివరాలు సేకరిస్తే అక్కడ అనుశ్రీగా ఉంది. దీంతో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.