ketaki
-
Single Movie: థియేటర్లలో నవ్వులే నవ్వులు
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి దర్శకుడు కార్తీక్‌రాజు ప్రేక్షకులను నవి్వంచారని, ముఖ్యంగా సెకండాఫ్‌లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవి్వంచారని వారు కొనియాడారు. -
డైరెక్టర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఫోటోలు వైరల్
అనుపమ సీరియల్ ఫేమ్, బుల్లితెర నటుడు రుషద్ రానా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. క్రియేటర్ డైరెక్టర్ కేటకీ వలవల్కర్ను ఆయన పెళ్లాడారు. బుధవారం ముంబయిలో జరిగిన వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ఈ వేడుకలో రూపాలీ గంగూలీ, సుధాన్షు పాండే, నిధి షా, గౌరవ్ ఖన్నాతో సహా పలువురు తారలు పాల్గొని పెళ్లిలో సందడి చేశారు. ముంబయిలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మరాఠీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే గతంలో ఖుష్నుమ్ను వివాహం చేసుకున్న రుషాద్ 2013లో విడిపోయారు. రుషద్ రానా అనుపమ సీరియల్‌తో ఫేమస్ అయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహబంధంతో ఇవాళ ఒక్కటయ్యారు. దర్శకురాలైన కేటకీ వలవల్కర్ చాలా కాలంగా బాలీవుడ్ పరిశ్రమలో కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
Ketaki Sheth: ఫొటోస్టూడియో ఆటోబయోగ్రఫీ
ఒకసారి కళ్లు మూసుకొని స్మార్ట్‌ఫోన్ కెమెరాలు లేని ఫొటోస్టూడియోల కాలంలోకి వెళ్లండి. దీపావళి పండగరోజు అక్కయ్య, అన్నయ్యలతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో గుర్తుందా? ‘రెడీ... అనగానే అలా కళ్లు మూయవద్దు తల్లీ’ అని సుతిమెత్తగా మందలించిన మీ ఊరిలోని ఫొటోగ్రాఫర్ గుర్తున్నాడా? ఫిల్టర్లు, మొబైల్ ఫోన్ అప్లికేషన్లు లేని ఆ కాలంలో స్టూడియోలలోని అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ గుర్తుకొస్తున్నాయా? కేతకి సేథ్ తన ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో ఆ కాలంలోకి తీసుకువెళుతుంది. పదండి ఒకసారి... సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చిన తరువాత ‘ఫొటో స్టూడియో’లు తగ్గిపోయాయి. ఉన్నవి ఆనాటి వెలుగును కోల్పోయాయి. ఎన్నో కుటుంబాలతో అనుబంధాలు పెనవేసుకున్న అలనాటి ఫొటోస్టూడియోల గత వైభవాన్ని ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ కేతకి సేథ్. 2014లో నార్త్ ముంబైలోని ‘జగదీష్ ఫొటోస్టూడియో’లోకి కేతకి అడుగుపెట్టినప్పుడు అది ఫొటో స్టూడియోలా లేదు. గతకాల వైభవంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ఇక అది మొదలు 2018 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 67 పాత ఫొటోస్టూడియోలను సందర్శించింది. ఆ జ్ఞాపకాలను రికార్డ్ చేసింది. దిల్లీలోని ‘ఫొటోఇంక్’ గ్యాలరీలో తొలిసారిగా ‘ఫొటోస్టూడియో’ పేరుతో ఫొటోఎగ్జిబిషన్ నిర్వహించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కేతకి ప్రాజెక్ట్‌పై ‘ఫొటోస్టూడియో’ పేరుతో నాణ్యమైన పుస్తకం కూడా వచ్చింది. తాజాగా... పాతతరానికి సంబంధించిన కొత్త ఫొటోలతో ముంబైలో చెమౌల్డ్ ప్రిస్కాట్ రోడ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేతకి. ఈ ఫొటోలలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఫొటోస్టూడియోలు ఉండడం విశేషం. అప్పట్లో ఇమేజ్–క్రేజ్ బాగా ఉండేది. స్క్రీన్‌కి అవతలి ప్రపంచాన్ని ఊహించేవారు కాదు. అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి అభిమాన తారల వరకు ఎన్నో బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ స్టూడియోలలో కనిపించేవి. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్లో కనిపించి కనువిందు చేస్తాయి. కేతకి తన ప్రయాణంలో నాటి ఫొటోగ్రాఫర్లతో మాత్రమే కాదు, ఫొటోస్టూడియోలలో బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్స్ గీసే ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడింది. అలనాటి ఫొటోస్టూడియో యజమానులతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఫొటోస్టూడియోలు తమ ఆటోబయోగ్రఫీని చెప్పుకుంటున్నట్లుగా ఉంది! ‘గతంలో ఎన్నో ఫొటో ఎగ్జిబిషన్లకు వెళ్లాను. కాని వాటన్నిటికంటే ఈ ఎగ్జిబిషన్ నాకు బాగా దగ్గరైంది. నా కాలంలోకి, సొంత ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. గ్యాలరీ నుంచి బయటికి వచ్చినా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటుంది ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లివచ్చిన అరవై అయిదు సంవత్సరాల పూర్ణ. ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్ సూపర్‌హిట్ అయిందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది! -
కేతకీలో కర్ణాటక మంత్రి పూజలు
ఝరాసంగం రూరల్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కర్ణాటక రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి ఈశ్వర్ బీమన్న ఖండ్రే సతీసమేతంగా పూజలు నిర్వహించారు. గురువారం సంగమేశ్వర స్వామి దర్శన నిమిత్తం వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, ఈవో మోహన్‌రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లకు దర్శించుకోని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.