breaking news
kesavareddy educational institutions
-
కేశవరెడ్డి విద్యాసంస్థలపై చార్జ్‌షీట్ దాఖలు
అనంతపురం: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కేశవరెడ్డి పాఠశాలపై సీఐడీ అధికారులు గురువారం అనంతపురం జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి డిపాజిట్లు సేకరించి గడువు ముగిసినా చెల్లించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం పోలీసుస్టేషన్లో 149/2015 కేసు నమోదైంది. ఇక్కడి నుంచి కేసు సీఐడీకి బదిలీ అయింది. సీఐడీ అధికారులు 37 మందిని విచారించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా నాగిరెడ్డి కేశవరెడ్డి అలియాస్ కేశవరెడ్డితో పాటు ఆయనకు చెందిన 11 సొసైటీలను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి 48 డాక్యుమెంట్లను సీఐడీ అడిషనల్ ఎస్పీ శ్రీధర్, పీపీ నారాయణస్వామి ట్రంకు పెట్టెలో పెట్టి జిల్లా కోర్టుకు సమర్పించారు. -
కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ఆందోళన
పాణ్యం(కర్నూలు): డిపాజిట్లు తిరిగివ్వాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. తమ విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే సమయంలో తీసుకున్న డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూవిద్యార్థుల తల్లిదండ్రులు గత కొద్ది కాలంగా ఆందోళనలు చేపడుతుండగా.. సోమవారం మండల పరిధిలోని బాధితులంతా కలిసి నెరవాడలోని కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ధర్నా నిర్వహించారు. యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.