breaking news
kesara
-
కీసర: వ్యభిచార గృహంపై దాడి.. గతంలోనూ అదే పని
కీసర: గోధుమకుంట పంచాయతీ పరిధిలోని టీపీఎస్‌కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై కీసర పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను సోమవారం అరెస్టు చేశారు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన కె.కుమారస్వామి(49) ఈసీఐఎల్ ఎంజేకాలనీలో నివసిస్తున్నాడు. ఇతనికి కీసర మండలం టీపీఎస్‌కాలనీలో హోటల్ నిర్వహించే ఓ మహిళ (అరుణకుమారి)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరిపై గతంలో మేడిపల్లి పీఎస్ పరిధిలో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు కేసు నమోదయ్యింది. తర్వాత తమ మకాంను గోధుమకుంట టీపీఎస్‌కాలనీకి మార్చారు. ఆన్లైన్లో డబ్బులు వసూలు చేసి కస్టమర్లు అడిగిన చోటకి మహిళలను పంపేవాడు కుమారస్వామి. గత నెల అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ ఢాకాకు చెందిన మహిళ కలకత్తా నుంచి వచ్చి వీరిని ఆశ్రయించింది. ఆ మహిళను బొడుప్పల్కు చెందిన కస్టమర్ వద్దకు పంపేందుకు సిద్దమవుతుండగా సమాచారం అందుకున్న కీసర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వాడిన కారు, రెండు సెల్ఫోన్లు, రూ.4వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..) -
హత్యా...?ఆత్మహత్యా...?
-
కందకంలోకి బోల్తా కొట్టిన కారు
కంచికచర్ల : కారు కందకంలో బోల్తా పడి చిన్నారికి గాయాలు కాగా భార్యాభర్తలు ప్రమాదం నుంచి బయట పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. జాతీయ రహదారిపై విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మండలంలోని కీసర సమీపంలోకి రాగానే అదుపు తప్పి కందకంలోకి దూసుకెళ్లింది. కారులో హైదరాబాద్‌కు చెందిన ఓబుల్‌రెడ్డి అతని భార్య కనకలక్ష్మి, ఐదునెలల కూతురు ఉన్నారు. ప్రమాద సమాయంలో కారులో ఉన్న ఎయిర్బెలూన్లు తెరుచుకోవటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో ఉన్న చిన్నారి హార్ధియా కారు నుంచి కందకంలో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.