breaking news
Kenya terror attack
-
‘చావు’ ఆటతో దక్కిన ప్రాణాలు...
సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో యూదు పుస్తక దుకాణం యజమాని తన కొడుకును నాజీల నుంచి రక్షించుకునేందుకు ఆడిన ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. నాజీల శిబిరంలో జరుగుతున్నదంతా దాగుడు మూతల ఆట అని అతను తన కొడుకును నమ్మిస్తాడు. తానూ ఆడతాడు. చివరకు అమెరికన్లు నాజీల శిబిరాన్ని స్వాధీనం చేసుకోవడంతో తండ్రీ కొడుకులు ప్రాణాలు దక్కించుకుంటారు. అదే తరహాలో ఇటీవల సంచలనం సృష్టించిన కెన్యా మాల్ ఘటనలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ఓ తల్లి తన పిల్లలతో ‘చావు’ ఆట ఆడింది. కాల్పులు మొదలైన వెంటనే అప్రమత్తంగా స్పందించిన తల్లి ‘చావు’ ఆట ఆడదామంటూ తన ఇద్దరు కూతుళ్లనూ మెదలకుండా పడుకోమని చెప్పింది. తుపాకుల మోత హోరెత్తుతున్నా, ఆ తల్లీ పిల్లలు చలనం లేకుండా పడుకుని ఉండటంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. షాపింగ్ మాల్లోని సీసీ కెమెరాలు చిత్రించిన వీడియోలో ఈ ఉదంతమంతా నమోదైంది. ఇద్దరిలో పెద్ద అమ్మాయి షాపింగ్ బ్యాగును పట్టుకుని మెదలకుండా ఉండగా, కెన్యా సైనికులు ఆమెను బయటకు తరలిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి. -
కెన్యా మృతులలో బెంగళూరు వాసి.. మృతుల్లో భారతీయులు ముగ్గురు
కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ షా షాపింగ్ మాల్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన వారిలో మరో భారతీయుడి మృతదేహన్ని భద్రత దళాలు గుర్తించాయి. బెంగళూరుకు చెందిన సుదర్శన్ బి. నాగరాజ్ కూడా ముష్కర మూకల తుపాకి గుళ్లకు బలైపోయారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఆ ఘటనలో మృతి చెందిన భారతీయుల సంఖ్య మూడుకు చేరుకుందని విదేశాంగ శాఖ పేర్కొంది. శనివారం జరిగిన ఆ దాడిలో మరణించిన వారి సంఖ్య 62కు పెరిగిందని చెప్పింది. నైరోబీలోని ఫార్మసీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ నటరాజన్ మరణించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి కుమారుడు, ఎనిమిదేళ్ల బాలుడు పరాంశ్ జైన్ కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో గాయపడిన పలువురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.