‘చావు’ ఆటతో దక్కిన ప్రాణాలు... | Kenya mall siege miracle: Mother saves her daughters with 'Death Game' | Sakshi
Sakshi News home page

‘చావు’ ఆటతో దక్కిన ప్రాణాలు...

Sep 26 2013 3:03 AM | Updated on Sep 1 2017 11:02 PM

కాల్పులు మొదలైన వెంటనే అప్రమత్తంగా స్పందించిన తల్లి ‘చావు’ ఆట ఆడదామంటూ తన ఇద్దరు కూతుళ్లనూ మెదలకుండా పడుకోమని చెప్పింది.

సుప్రసిద్ధ ఇటాలియన్‌ చిత్రం ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో యూదు పుస్తక దుకాణం యజమాని తన కొడుకును నాజీల నుంచి రక్షించుకునేందుకు ఆడిన ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. నాజీల శిబిరంలో జరుగుతున్నదంతా దాగుడు మూతల ఆట అని అతను తన కొడుకును నమ్మిస్తాడు. తానూ ఆడతాడు. చివరకు అమెరికన్లు నాజీల శిబిరాన్ని స్వాధీనం చేసుకోవడంతో తండ్రీ కొడుకులు ప్రాణాలు దక్కించుకుంటారు. అదే తరహాలో ఇటీవల సంచలనం సృష్టించిన కెన్యా మాల్‌ ఘటనలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు ఓ తల్లి తన పిల్లలతో ‘చావు’ ఆట ఆడింది.

కాల్పులు మొదలైన వెంటనే అప్రమత్తంగా స్పందించిన తల్లి ‘చావు’ ఆట ఆడదామంటూ తన ఇద్దరు కూతుళ్లనూ మెదలకుండా పడుకోమని చెప్పింది. తుపాకుల మోత హోరెత్తుతున్నా, ఆ తల్లీ పిల్లలు చలనం లేకుండా పడుకుని ఉండటంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. షాపింగ్‌ మాల్‌లోని సీసీ కెమెరాలు చిత్రించిన వీడియోలో ఈ ఉదంతమంతా నమోదైంది. ఇద్దరిలో పెద్ద అమ్మాయి షాపింగ్‌ బ్యాగును పట్టుకుని మెదలకుండా ఉండగా, కెన్యా సైనికులు ఆమెను బయటకు తరలిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement