breaking news
	
		
	
  kavithalu
- 
      
                   
                               
                   
            రా...
ఎక్కడని నన్ను వెతుకుతావు భగ భగ మండుతున్న పద్య పాదాలమీంచి నడిచి రా ఝుం ఝుం మని వీచే గాలుల్లోకి రా అడవుల్లో వాగుల్లో కొండల్లో కోనల్లో సమూహంగా పరిగెత్తే మహిషాల గుంపుల్లోకి రా వేటగాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడే క్రోధారుణిమ మొహాల్లోకి రా చింతనిప్పుల కళ్ళతో వర్తులంగా ఆకాశంలోంచి గిరికీలు కొట్టే గెద్ద చూపుల్లోకి రా నాగరిక సమాజం తరిమేసిన శిశువుల్లో అడవి పెంచి పెద్ద చేసిన డాన్ బాస్కోల్లోకి రా వాడి నిశ్శేషం కోసం బోధి వృక్షం క్రింద సాము చేస్తున్న వారి ముందు నిల్చో - విజయచంద్ర 9438720409 - 
      
                    
మీరు మెచ్చే కవితలు!

 వెలుతురు సోకని చెట్లు నడుస్తుంటాయి
 వాటిని చూసేందుకు
 మృత్యు వొక్కటే దారి
 
 రాతిచెట్టు నీడలోపలికి దిగిన నిచ్చెన కాళ్ళకింద
 పచ్చకామెర్ల రంగు ఆక్టోపస్ ఆపిల్పండుని తింటోంది
 
 సంగీతం వినిపించదు చెట్ల నుంచి
 పెదవులూ కనిపించవు
 
 సీసపు మంచు కురుస్తోన్న నగరతలం మీద
 ఒక ఆకుపచ్చని నీటిబిందువు స్పృహతప్పి
 రాలిపోతూంటుంది ముసలిచేతులతో.
 
 చిత్రకొండ గంగాధర్
 
 (చిత్రకొండ గంగాధర్ 1999లో రాసిందిది. అతడి ప్రస్తుత ‘ఉనికి’ తెలీదు. గంగాధర్ పాతకాగితాల బొత్తిని భద్రపరిచిన భగవంతం, దాన్ని అందజేయడంలో చొరవచూపిన బి.అజయ్ప్రసాద్ వల్ల ఈ కవిత ఈ పేజీకి చేరింది. అజయ్ ఫోన్: 9247733602)
 
 
 ‘అబ్బా! ఏం రాసాడ్రా బాబూ’
 అంటూ కొన్ని అక్షరాలు మెచ్చుకున్నాయి!
 ‘నన్ను మలుచుకోలేదేం’ అంటూ మరికొన్ని అక్షరాలు
 కుళ్ళుకున్నాయి!!
 
 కొన్ని-
 కవిత్వంలో తడిసిముద్దై
 పుష్కరాలు జరుపుకున్నాయ్!
 
 
 కొన్ని..!
 కొన్ని-
 నిష్ర్పయోజనంగా పరుగెత్తే రోజుల్లాగ
 తరువాత చటుక్కున తిప్పేసే పుటల్లాగ
 మెదడన్నా గుర్తుంచుకోలేని వ్యర్థంలాగా
 ఆవిరైపోయాయ్!
 సాధనా లోపం ఎక్కడో వెతుక్కుంటూ
 కవితాక్షరం కవి‘తల్లో’కి చటుక్కున పరుగెత్తింది!
 
 చలపాక ప్రకాష్, 9247475975
 
 
 పస
 తెలువకుండానే పుట్టాము
 
 జిజ్ఞాసతో అక్షరం వెంట నడిచాను
 కోరిక తీరినా కోరికతో
 తీరిక లేకుండా వాలులో
 కాలు కాలిన పిల్లిలా తిరిగాను
 
 శునకంలా గతికిగతికానో లేదో
 దాసన్న పువ్వులా విచ్చిన తల్లీ
 నచ్చిన పిల్లలూ మెచ్చని ఇల్లూ
 చిరునామా పక్కాగా ఏర్పడింది
 
 తల్లడిల్లే గుండె పగుళ్లు
 మోయలేని వేదనా దుఃఖాలు
 మాయలేక బాధిస్తున్న నఖ సుఖాలు
 పసిద్ధ ఉదయం నుంచి రాత్రికి
 ఖతర్నాక్ రాత్రి మీంచి ఉదయంకి
 ఏండ్లకేండ్లు ప్రవహించుతాము
 
 అసంపూర్తి వాక్యంలా అసంతృప్తి
 వెలుగు కలుగులా
 చీకటి అలుగులా
 
 మట్టమీద పడ్డ అగ్గి కాలుతుందని ఎరుకైనా
 తడిబట్టేసుకొని పరాకత్గా
 పట్టనట్టు గోడకు బొడ్డెమొలను కొట్టినట్టు
 పురుసత్గా బేజార్ కైజార్ పాగల్ జీవితం
 
 శబరి 


