breaking news
kattedan industrial estate
-
కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని మైలర్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో పోలీసులకు,ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలువ్యాపించడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ కంపెనీలో కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. -
ఊరవతలికి కాలుష్యం!
గ్రేటర్లో పర్యావరణ హననానికి కారణమవుతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)సన్నాహాలు చేస్తోంది. ఇందులో తొలివిడతగా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమలను సైతం ముచ్చెర్ల ఫార్మా సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తొలిదశలో కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని మరో వెయ్యి బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే పరిశ్రమల తరలింపును కాటేదాన్ పారిశ్రామిక వాడకు సంబంధించిన పరిశ్రమల వర్గాలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కాటేదాన్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలే అధికంగా ఉన్నాయని, కాలుష్య కారక పరిశ్రమలను ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి మూసివేయించిందని వారు స్పష్టం చేస్తున్నారు. విడతల వారీగా పరిశ్రమల తరలింపు... గ్రేటర్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాలు తదితర కాలుష్య కారక పరిశ్రమలకు కాటేదాన్ నిలయంగా ఉంది. ఈ పారిశ్రామిక వాడ కారణంగా స్థానికంగా ఉన్న నూర్‌మహ్మద్ కుంట కాలుష్యకాసారమైన విషయం విదితమే. అంతేకాదు ఈ వాడ జి.ఓ.111 పరిధిలోనే ఉండడంతో జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు సైతం శాపంగానే పరిణమిస్తోంది. ఈనేపథ్యంలో తొలివిడతగా ఈ పారిశ్రామిక వాడలోని కాలుష్య కారక కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరవాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే వీటిలో ఫార్మా, ఇంటర్మీడియెట్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. కాటేదాన్‌లో ప్రస్తుతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే అధికసంఖ్యలో ఉన్నాయని..వీటిలో సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని కాటేదాన్ పారిశ్రామికవాడ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిని ఒకేసారి నగరానికి సుదూరంగా తరలిస్తే కార్మికులకు ఉపాధి దూరమౌతుందని..మరోవైపు పరిశ్రమల తరలింపు చిన్న పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఈ తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం. -
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో సప్తగిరి ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు ఆర్పుతున్నారు. అయితే అగ్నిప్రమాదంలో కంపెనీలోని మిషన్లు, ప్లాస్టిక్ సామాగ్రి అంతా కాలి బూడిద అయింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఈ ప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.