breaking news
Kathiresan-Meenakshi couple
-
అయ్యా... నీతులు ధనుష్‌కి చెప్పండి
సాక్షి, చెన్నై : తన ఫ్యాన్స్‌తో భేటీ అయి బిజీగా ఉన్న తలైవాకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రెండు రోజుల క్రితం సమావేశంలో మాట్లాడుతూ... ఏ మనిషికైనా కుటుంబమే ముఖ్యమంటూ తన అభిమానులకు రజనీ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనుష్ తండ్రినంటూ ఆ మధ్య కేసు వేసిన వ్యక్తి మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. తన కొడుకును తన దగ్గరికి పంపిచేయాలంటూ రజనీని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘‘ధనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు. అయినా స్పందించకపోవటం దారుణం’’ అని కదిరేషన్ సంచలన వ్యాఖ్య చేశాడు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన కదిరేశన్ ఈ మేరకు రజనీకి ఓ లేఖ పంపుతున్నట్టు చెబుతూ.. మీడియాకు కూడా చూపించారు. తన భార్య మీనాక్షి తీవ్ర అనారోగ్యంతో ఉందని, తమ కుమారుడు తమకు అండగా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ధనుష్ నుంచి పైసా అక్కర్లేదని.. తమకు తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ఆయన అంటున్నాడు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని తమ కుమారుడు అయిన ధనుష్ కు కూడా చెప్పాలని కదిరేషన్ హితవు పలికాడు. ఎలాగైనా తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ధనుష్ తన కుమారుడేనంటూ మేలూరు కోర్టులో కదిరేశన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి ధనుష్ స్టే తెచ్చుకుని, ఆ తర్వాత కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. -
రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట!
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనంటూ మేలూరు వృద్ధ దంపతులు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టిపారేసింది. నటుడు ధనుష్ తమ కుమారుడేనని, చిన్నప్పుడు స్కూలు చదువు మధ్యలోనే మానేసి.. ఇంటి నుంచి పారిపోయాడని మేలూరుకు చెందిన కదిరేశన్-మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను సైతం కోర్టుకు ఆ దంపతులు సమర్పించారు. దీంతో పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్‌కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఆ దంపతులు పేర్కొన్నవిధంగా ధనుష్‌కు పుట్టుమచ్చలు లేకపోవడంతో లేజర్ ట్రీట్మెంట్తో ఆయన తొలగించుకొని ఉంటాడని అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో డీఎన్ఏ టెస్టుకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా.. అందుకు ధనుష్ నిరాకరించాడు. ఈ క్రమంలో వాదనలు విన్న మధురై బెంచ్ వృద్ధ దంపతుల పిటిషన్‌ను తోసిపుచ్చి.. ధనుష్‌కు ఊరటనిచ్చింది.