అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్
హీరోయిన్ అనుష్క శెట్టి బయట కనిపించి చాలా ఏళ్లు గడిచిపోయింది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలూ చేస్తూ వస్తోంది. అయితే 'సైజ్ జీరో' చేసిన తర్వాత ఈమెకు బరువు సమస్యలు రావడంతో మూవీస్ అయితే చేస్తోంది గానీ ప్రచారానికి మాత్రం నో చెబుతూనే వస్తోంది. గతేడాది 'ఘాటీ' చిత్రం చేసింది. దీని ప్రమోషన్లోనైనా కనిపిస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అలాంటిది ఇప్పుడు చిత్రమైన రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?)అనుష్క ఇప్పటివరకు తెలుగు, తమిళంలో మాత్రమే సినిమాలు చేసింది. తొలిసారి మలయాళంలో 'కథనార్' అనే మూవీలో నటించింది. రీసెంట్‌గానే తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీని ఒకటి రెండు షాట్స్‌కే పరిమితం చేయడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్ర ప్రచారానికి అనుష్క.. ఏకంగా హైదరాబాద్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఆడియెన్స్ మాత్రం నమ్మట్లేదు.ఎందుకంటే తెలుగులో నేరుగా సినిమాలు చేసినప్పుడే వాటిని ప్రమోట్ చేసేందుకు బయటకు రాలేదు. అలాంటిది ఓ మలయాళ డబ్బింగ్ చిత్రం కోసం హైదరాబాద్ వస్తుందా? సందేహమే అని మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే మూవీ థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. కానీ ఏ నెల అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 9వ శతాబ్దానికి చెందిన కథనార్ అనే క్రైస్తవ మతప్రచారకుడి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.(ఇదీ చదవండి: చిరైయా రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!)