breaking news
Karunanidhis grandson
-
సోషల్ మీడియాలో కరుణానిధి వైరల్ వీడియో
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన ముని మనవడిని ముద్దాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరుణానిధి చిన్న కుమారుడు తమిళరసు. అతడి కుమారుడు అరుళ్నిధి కుమారుడైన మగిళన్కు కరుణానిధి ముద్దుపెడుతునట్లు ఈ వీడియోలో ఉంది. కాగా, కరుణానిధి ఆరోగ్యంలో పురోగతి కనిపిస్తోంది. ప్రత్యేక సహాయకురాలు నిత్య ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ఆయనకు ప్రస్తుతం ద్రవాహారాన్నే అందిస్తున్నారు. ఆయనను దయాళు అమ్మాల్, రాజాత్తి అమ్మాల్ రోజూ పరామర్శిస్తున్నారు. కుమార్తె సెల్వి దగ్గరుండి కరుణానిధిని చూసుకుంటున్నారు. కుమారులు స్టాలిన్, తమిళరసు, కుమార్తె కనిమొళి, సహాయకులు రోజూ కరుణను కలిసి మాట్లాడుతున్నారు. కాగా గత కొంతకాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతార
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో వ్యక్తిగా ఉండే నయనతార... ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. స్వయానా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు, తమిళ యువహీరో ఉదయనిధి స్టాలెన్ని గోళ్లతో రక్కేయడమే కాక, అతణ్ణి ఆసుపత్రి పాలు చేసి సంచలనమే సృష్టించారు. వివరాల్లోకెళ్తే... నయన, ఉదయనిధి స్టాలిన్ కలిసి ‘నన్బేన్డా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో నయనతారకు ఉదయనిధి స్టాలిన్ ప్రేమ ప్రతిపాదన చేశాడనీ, నయనతార కాదనడంతో తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ కొన్ని కథనాలు మీడియాలో వెలువడ్డాయి. దీంతో ఖంగు తిన్న స్టాలిన్ అసలు విషయం మీడియాకు చెప్పేశారు. తాను ఆసుపత్రి పాలవ్వడానికి కారణం నయనతార అన్నమాట నిజమే కానీ... అది అందరూ అనుకుంటున్న కారణం కాదనీ, షూటింగ్లో జరిగిన చిన్న ప్రమాదం వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందనీ ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. ‘‘నయనతార నాకు మంచి స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య ‘ప్రేమ’ అనే వ్యవహారమే లేదు. కానీ... లేనిపోనివి సృష్టించేసి అవాకులు చవాకులు రాసే శారు. నిజానికి అక్కడ జరిగింది వేరే. షూటింగ్లో భాగంగా ఓ షాట్లో నయన, నేనూ దొర్లుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత నయన లేచి అక్కడే ఉన్న ప్రతినాయకుడి చెంప ఛెళ్లుమనిపించాలి. అయితే... కంగారులో విలన్ను కొట్టబోయి పొరపాటున నా చెంప ఛెళ్లుమనిపించింది. ఆ దెబ్బ నా కంటికి బలంగా తగిలింది. కనురెప్పపై గోళ్లతో రక్కినట్లు గాయం అయ్యింది. దాంతో హడావిడిగా హాస్పటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా తాను పొరపాటున చేసిందే’’ అని చెప్పారు ఉదయనిధి స్టాలిన్. ఏది ఏమైనా నయనతార ఏం చేసినా సంచనలమే.