breaking news
karimnagar govt hospital
-
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరికి గాయాలు
బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కన్నాల పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి మండలానికి చెందిన యాట పోచమల్లు (35), ఆయన భార్య మల్లేశ్వరి(30)తో కలసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ జిల్లా శ్రీరామ్‌పూర్ వెళుతున్నారు. కన్నాల పాత పెట్రోల్ బంక్ సమీపంలో వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోచమల్లు, మల్లేశ్వరి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. టోల్‌గేట్‌కు చెందిన వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
డెంగీతో వృద్ధురాలి మృతి
బెజ్జంకి(కరీంనగర్): డెంగీ వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. బెజ్జంకి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అననేని లచ్చవ్వ (62) ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది. అయితే, బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది.