డెంగీతో వృద్ధురాలి మృతి | old woman dies due to dengue disease | Sakshi
Sakshi News home page

డెంగీతో వృద్ధురాలి మృతి

Aug 19 2015 4:31 PM | Updated on Sep 3 2017 7:44 AM

డెంగీ వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ వృద్ధురాలు మృతి చెందింది.

బెజ్జంకి(కరీంనగర్): డెంగీ వ్యాధితో కరీంనగర్ జిల్లాలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. బెజ్జంకి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అననేని లచ్చవ్వ (62) ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది.

కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది. అయితే, బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement