ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి
– మణిపూర్ రాష్ట్రం నుంచి వచ్చిన కప్పట్రాళ్ల అంజనమ్మకు సన్మానం
కర్నూలు : కప్పట్రాళ్ల అంజనమ్మ సూ్ఫర్తితో ప్రతి మహిళ జిల్లాలో ఆర్థికంగా బలోపేతం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్యసంఘం తరపున ఇతర మహిళలతో కలసి అంజనమ్మ మణిపూర్ రాష్ట్రానికి రిసోర్స్ పర్సన్‌గా వెళ్లి మహిళా సాధికారత గురించి అక్కడి సంఘాలకు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజనమ్మను ఎస్పీ సన్మానం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో తయారు చేసిన చేనేత శాలువలను ఎస్పీకి అంజనమ్మ అందజేశారు. కార్యక్రమంలో కోడుమూరు వ్యవసాయాధికారి అక్బర్ బాషా, ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు పాల్గొన్నారు.