breaking news
Kanpur bride
-
కిలేడీ మాస్టర్ ప్లాన్.. పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో పరార్!
లక్నో: వివాహం జరిగిన మరుసటి రోజునే వరుడికి షాక్ ఇచ్చింది ఓ నవ వధువు. ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది. ఆ తర్వాత వరుడికి ఫోన్ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పేసింది. ‘నేను నిన్ను ప్రేమించలేదు. నున్వు నాకు ఫోన్ చేయొద్దు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టుకెళ్లిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు వరుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన అక్టోబర్ 4నే జరిగినా.. బిల్హార్ పోలీస్ స్టేషన్లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదిర్చుతామని నమ్మించారు. అందుకు తమకు రూ.70వేలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి కుదిర్చారు. సెప్టెంబర్ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించారు. అక్టోబర్ 1న గయాలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరవింద్. అక్టోబర్ 4న తెల్లవారి నిద్రలేచే సరికి అతని భార్య కనిపించలేదు. ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం కనిపించలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్ చేసి తన కోసం వెతకొద్దని చెప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి -
ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే ...
లక్నో : మరికాసేపట్లో పెళ్లి... ఇంతలో స్నేహితులతో కలసి పీకల్దాకా మందుకొట్టాడు. ఇంతలో పెళ్లి ఉంది కదూ అంటూ ఎలాగోలా వివాహ వేడుక వద్దకు చేరుకుని... మండపంలో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ వరుడు అడుగు తడబడుతుంది... పీటల వద్ద తూలాడు. అక్కడే ఉన్న స్నేహితులు సాయం చేసి... పీటల మీదకు వరుడిని కూర్చోబెట్టారు. అప్పటికే పీటల మీద ఉన్న వధువు సజేతికి కాబోయే వాడు 'మందుబాబు' అని అర్థమైంది. అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాకీ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది. ఇంతలో అక్కడే ఉన్న వరుడి తల్లిదండ్రులు ఆ నవవధువుకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఇలాంటి తాగుబోతుతో తాళీ కట్టించుకోనని సజేతీ తేల్చి చెప్పింది. ఎలాగైనా తమ కుమారుడిని వివాహం చేసుకోవాల్సిందే అని వరుడి తల్లిదండ్రులు పట్టుపట్టారు. దీంతో ఈ పంచాయితీ కాస్తా పోలీసుల వద్దకు చేరింది. ఇరు పక్షాల వారిని కూర్చోబెట్టి వధువుకు నచ్చ జెప్పెందుకు వారు ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం పెళ్లి చేసుకోనంటే చేసుకోనని మొండికేసి కూర్చుంది. దాంతో సజాతీ మొండితనానికి పోలీసులు దిగిరాక తప్పలేదు. వరుడి తల్లిదండ్రులకు ఎలాగోలా నచ్చజెప్పి... ఎటువంటి ఘర్షణలు...కేసులు లేకుండా ఇరు పక్షాల వారిని పోలీసులు పంపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూరులోని హమీర్పూర్ రోడ్డు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.